NTV Telugu Site icon

Leopard Roaming In Mahanandi : చిరుత దెబ్బకి కంటికి కునుకు లేకుండా జాగారణ చేస్తున్న జనం..

Leopard

Leopard

Leopard Roaming In Mahanandi : నంద్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన మహానందిలో చిరుత గత 22 రోజులుగా తిరుగుతూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తుంది. చిరుత సంచారానికి సంబంధించిన సిసిటీవీ ఫోటేజీలలో కూడా చాలానే మీడియా ద్వారా బయటికి వచ్చాయి. 22 రోజులుగా మహానంది పుణ్యక్షేత్రం చుట్టూ చిరుత చక్కర్లు కొడుతుండడంతో భక్తులు భయభ్రాంతులకు గురవుతున్నారు. అయితే చిరుతను బంధించడానికి అటవీ శాఖ అధికారులు అనేక మార్గాలను చేస్తున్నారు. మహానందిలోని విద్యుత్ సబ్ స్టేషన్, అన్నదాన సత్రం, మాడవీధుల్లో చిరుత సంచరిస్తున్నట్లు సమాచారం. అలాగే మహానంది చుట్టుపక్కల ప్రాంతంలోని ఫారెస్ట్ ఎకో కేంద్రం, అలాగే దేవస్థాన కాలనీలలో, ఇళ్ల మధ్యలో అలాగే కాస్త దూరంలో ఉన్న అరటి తోటల్లో కూడా చిరుత సంచరించడంతో మహానందిలో నివసిస్తున్న ప్రజలు కంటికి కునుకు లేకుండా జాగరణ చేస్తున్నారు.

CM Chandrababu Naidu: ఆంధ్రపదేశ్, తెలంగాణ నాకు రెండు కళ్లు..

దీంతో మహానంది స్థానికులు, అలాగే భక్తుల నుండి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. తాజాగా పచ్చర్ల గ్రామం వద్ద మాజీ సర్పంచ్ మాబునిసాను చంపిన చిరుతను బంధించి తిరుపతి జూకు తరలించారు. ఈ నేపథ్యంలో మహానందిలో సంచరిస్తున్న చిరుతను పట్టుకోవడానికి అటవీ అధికారులు మహానంది గోశాల ప్రాంతంలో బోనును ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఇందుకోసం ఉన్నత స్థాయి అధికారుల అనుమతి కోసం ఎదురుచూస్తున్నట్లు అడవి శాఖ అటవీ శాఖ అధికారులు తెలిపారు.

Chalasani Srinivas: గుజరాత్ పాలకుల కాళ్ళ కింద తెలుగు రాష్ట్రాలు ఉండాలా