Site icon NTV Telugu

Tirumala: తిరుమల అలిపిరి సమీపంలో మరోసారి చిరుత కలకలం..

Leopard Attack

Leopard Attack

తిరుమల అలిపిరి సమీపంలో వదలని చిరుతల బెడద పెరుగుతోంది. తాజాగా జూ పార్క్ రోడ్డు నుంచి తిరుమల టోల్ గేట్ మీదుగా అటవీ ప్రాంతంలోకి వెళ్లింది. చిరుతను గుర్తించిన సెక్యూరిటీ సిబ్బంది అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. ఏప్రిల్ 6వ తేదీ వేదిక్ యూనివర్శిటీలో బోనుకు ఓ చిరుత చిక్కిన విషయం తెలిసిందే. ఆహారం కోసం జనావాసాల్లోకి వస్తున్నట్లు సమాచారం చేస్తున్నట్లు తెలుస్తోంది.

READ MORE: Pak-India: ఎల్‌ఓసీ దగ్గర పాక్ మళ్లీ కవ్వింపు చర్యలు.. కాల్పుల్ని తిప్పికొట్టిన ఆర్మీ

గత కొన్నిరోజులుగా తిరుపతి నుంచి తిరుమలకు నడకమార్గంలో.. తరచూ చిరుతలు కనిపించడంతో శ్రీవారి భక్తులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. గతంలో ఇలాగే చిరుతలు.. నడక మార్గంలో పలువురు భక్తులపై దాడి చేసిన నేపథ్యంలో.. ప్రస్తుతం చిరుత సంచరిస్తోందనే వార్తలతో మరింత భయపడుతున్నారు. ఈ క్రమంలోనే భక్తుల రక్షణ కోసం తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు పటిష్ఠ భద్రతా చర్యలు చేపడుతున్నారు.

READ MORE: Medical Alert: జమ్మూకాశ్మీర్ ప్రభుత్వాస్పత్రులకు కీలక ఆదేశాలు.. సర్వం సిద్ధంగా ఉండాలని సర్క్యులర్ జారీ

ఈ నేపథ్యంలోనే.. తిరుమల నడకమార్గంలో గస్తీని టీటీడీ విజిలెన్స్ సిబ్బంది మరింత ముమ్మరంగా చేపడుతున్నారు. అదే సమయంలో నడకమార్గంలో వచ్చే భక్తులు కూడా తగిన జాగ్రత్తలు తీసుకుని.. కొండపైకి సురక్షితంగా చేరుకోవాలని సూచిస్తున్నారు. ఇక అలిపిరి నుంచి తిరుమలకు నడక మార్గంలో వెళ్లే భక్తులను తెల్లవారుజామున 5 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు గతంలో లాగే యథావిధిగా అనుమతిస్తున్నారు. విజిలెన్స్‌, అటవీశాఖ సిబ్బంది రాత్రి పూట గుంపులుగా భక్తులను పంపిస్తున్నారు.

READ MORE: Visakhapatnam: విశాఖలో కలకలం రేపిన దంపతుల దారుణ హత్య…

Exit mobile version