Leopard Killed: కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు శివారులో చిరుతపులి మృతి చెందింది. ఎల్లెల్సీ కాలువ సమీపంలో ఎంహెచ్ 167పై అర్ధరాత్రి గుర్తు తెలియని వాహనం ఢీకొని చిరుత పులి మృతి చెందినట్లు ఫారెస్ట్ రేంజర్ తేజస్విని తెలిపారు. అర్ధరాత్రి రోడ్డు దాటుతుండగా ప్రమాదానికి గురై ఉంటుందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కొద్ది రోజులుగా కొండప్రాంతాల నుంచి గ్రామాల సమీపంలోకి చిరుత పులులు సంచరిస్తున్నాయి.. ఎమ్మిగనూరు పట్టణ సమీపంలో చిరుత సంచారంపై స్థానికుల భయాందోళన చెందుతున్నారు.. పలుమార్లు ఫారెస్ట్ అధికారులకు ఫిర్యాదు కూడా చేసినట్టు చెబుతున్నారు.. అయితే, ఉన్నట్టుండి ఓ చిరుత రోడ్డు ప్రమాదంలో మృతిచెందింది.. ఉన్నతాధికారులు వచ్చాక చిరుతకు పోస్ట్ మార్టం నిర్వహించేందుకు ఫారెస్ట్ సిబ్బంది ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే, ఫారెస్ట్ సమీపంలోని గ్రామాల్లోనే కాక.. పట్టణ, నగర శివారు ప్రాంతాల్లోనూ కొన్నిసార్లు చిరుతల సంచారం స్థానికులను భయాందోళనకు గురిచేస్తున్న విషయం విదితమే. అయితే, ఇప్పుడు చిరుత మృతిపై అన్ని వైపుల నుంచి దర్యాప్తు చేస్తున్నారు ఫారెస్ట్ అధికారులు.. ప్రమాదవశాత్తు మృతిచెందిందా? ఇంకా ఏవైనా కారణాలు ఉన్నాయా? అనే కోణంలోనూ విచారణ సాగుతోంది.
Read Also: Delhi : అధికారులకు క్లాస్ పీకిన ఢిల్లీ జల మంత్రి అతిషి.. చర్యలు తప్పవని హెచ్చరిక