NTV Telugu Site icon

Grand Welcome For Lionel Messi: లియోనల్ మెస్సీకి ఘనస్వాగతం.. జన్మధన్యం

Messi

Messi

లియోనల్ మెస్సీ.. పేరు వినగానే ఫుట్ బాల్ ప్రేమికులు ఊగిపోతున్నారు. ఫిఫా ప్రపంచకప్‌ గెలిచిన అర్జెంటీనా జట్టు విజయోత్సవ వేడుకలలో భాగంగా ఆటగాళ్ల పరేడ్‌ను నిర్వహించారు. మంగళవారం జాతీయ సెలవుదినంగా ప్రకటించడంతో మెస్సీని చూసేందుకు తరలివచ్చారు అక్కడి జనం. ఫిఫా వరల్డ్‌కప్‌ను అర్జెంటీనా గెలవడం కోట్లాది మంది అభిమానులను ఆనందపరవశుల్ని చేసింది. ఆ ట్రోఫీతో స్వదేశంలో అడుగుపెట్టిన మెస్సీ సేనకు స్వాగతం పలకడానికి ఏకంగా 40 లక్షల మంది రోడ్లపైకి రావడం కూడా మనం చూశాం.

హెలికాప్టర్ ద్వారా మెస్సీ సేనకు పూలవర్షం కురిపించి.. అద్భుతమయిన స్వాగతం పలికారు. ఆ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. చిన్నాపెద్దా, ఆడమగా తేడా లేకుండా అంతా రోడ్లమీదకు వచ్చారు. జనసంద్రం రోడ్లమీదకు రావడంతో అక్కడేం జరుగుతుందో ఎవరికీ అర్థం కాలేదంటున్నారు. అర్జెంటీనాకు 36 ఏళ్ల తర్వాత మరోసారి వరల్డ్‌కప్‌ ట్రోఫీ అందించిన మెస్సీని అభిమానులు ఆకాశానికి ఎత్తేశారు. నీ జన్మధన్యం అయిందంటూ కామెంట్లు చేసేస్తున్నారు.

Read Also: Kishan Reddy: ఆ పంట సాగుకు అనుకూలమైన భూమి తెలంగాణలోనే ఉందిఇదిలా ఉంటే.. అర్జెంటీనా సెంట్రల్‌ బ్యాంక్‌ అక్కడి 1000 పెసో బ్యాంక్‌నోట్‌పై మెస్సీ ఫొటోను ముద్రించాలన్న ప్రతిపాదనను ప్రభుత్వం ముందు ఉంచిందనే వార్తలు వచ్చాయి. సెంట్రల్‌ బ్యాంక్‌ అధికారులు ఈ ప్రతిపాదన చేశారని, అక్కడి ఫైనాన్షియల్‌ న్యూస్‌పేపర్‌ ఎల్‌ ఫైనాన్సియెరో వెల్లడించిందని వార్తలు వచ్చాయి. అయితే, ఇది సరదాకి మాత్రమే చేసిందని తర్వాత వివరణ ఇవ్వాల్సి వచ్చింది. 1978లో తొలిసారి ఫిఫా వరల్డ్‌కప్‌ను గెలిచినప్పుడు అర్జెంటీనాలో సంబరాలు జరిగాయి. స్మారక నాణేలు కూడా విడుదల చేసింది ప్రభుత్వం. ఇన్నేళ్ళ తర్వాత మళ్ళీ చరిత్రాత్మక విజయం అందుకున్న ఆ దేశప్రజలు అది చిరస్మరణీయంగా వుండిపోవాలని కోరుకుంటున్నారు.

నగరమంతా జనసందోహమే.

అపూర్వ స్వాగతం 

Read Also: Taj Mahal: తాజ్ మహల్ సందర్శించాలంటే.. కోవిడ్ పరీక్ష తప్పనిసరి