Site icon NTV Telugu

LEO : థర్డ్ సింగిల్ పై అప్డేట్ ఇచ్చిన మేకర్స్..

Whatsapp Image 2023 10 08 At 5.44.21 Pm

Whatsapp Image 2023 10 08 At 5.44.21 Pm

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి నటిస్తున్న లేటెస్ట్ మూవీ లియో.. ఈ సినిమా ను కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తెరకెక్కిస్తున్నాడు.ఈ సినిమాపై భారీగా అంచనాలు పెరుగుతూనే ఉన్నాయి. మాస్టర్‌ వంటి బ్లాక్‌ బస్టర్‌ సినిమా తర్వాత వీళ్ల కాంబో లో సినిమా తెరకెక్కడం, పైగా ‘LCU’ లో భాగంగా సినిమా తెరకెక్కుతున్నట్లు వార్తలు కూడా రావడంతో లియో పై భారీగా హైప్ పెరిగింది. రీసెంట్ గా విక్రమ్ వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత లోకేష్‌ తెరకెక్కిస్తున్న సినిమా ఇదే కావడంతో అంచనాలు తారా స్థాయి కి చేరాయి.ఇక ఇప్పటికే రిలీజైన టీజర్‌ మరియు ట్రైలర్‌ కూడా మిలియన్‌లలో వ్యూస్‌ను సాధించి సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి.. ఈ సినిమాను దసరా కానుక గా అక్టోబర్ 19 న గ్రాండ్ గా విడుదల చేయబోతున్నారు.ఇక సినిమా రిలీజ్‌ డేట్‌ దగ్గర పడుతుడంటంతో మేకర్స్ కూడా వరుస అప్‌డేట్‌లు ప్రకటిస్తూ సినిమాపై ఆసక్తి ని పెంచుతున్నారు. తాజాగా ఈ సినిమా మూడో పాట కు సంబంధించిన ఓ క్రేజ్‌ అప్‌డేట్‌ను మేకర్స్‌ ప్రకటించారు.

ఈ సినిమాలోని థర్డ్‌ సింగిల్‌ రేపు రిలీజ్‌ కానుంది.. ఇప్పటికే రిలీజైన నా రెడీ, బాడాస్‌ సాంగ్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి..దీనితో థర్డ్ సింగిల్ ఎలా ఉంటుందో ఫ్యాన్స్ ఎంత గానో ఎదురుచూస్తున్నారు.ఈ సినిమాను పాన్‌ ఇండియా రేంజ్ లో రిలీజ్ చేస్తున్నారు కాబట్టి ఈ సారి భారీ ఎత్తున ప్రమోషన్‌లు ప్లాన్‌ చేస్తున్నారని సమాచారం.మరీ ముఖ్యంగా తెలుగులో కూడా ఈ సినిమా ప్రమోషన్‌లు భారీ ఎత్తులో జరపాలని మేకర్స్ భావిస్తున్నట్లు సమాచారం.ఎందుకంటే ఇటీవల కాలంలో తెలుగు లో డబ్‌ అయిన జైలర్ వంటి సినిమాలు ఊహించని రేంజ్‌ లో కలెక్షన్‌లు సాధించాయి.. దాంతో ఈ సినిమాను పెద్ద లెవల్లో ప్రమోట్‌ చేసి సినిమాపై క్రేజ్‌ను మరింత తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు.

Exit mobile version