NTV Telugu Site icon

Lenovo Yoga Pro 7i Price: ‘యోగా ప్రో 7ఐ’ ల్యాప్‌టాప్‌.. సూపర్ లుకింగ్, బెస్ట్ పెర్మామెన్స్!

Lenovo Yoga Pro 7i Price

Lenovo Yoga Pro 7i Price

Lenovo Yoga Pro 7i Laptop Price in India: చైనీస్ మల్టీ నేషనల్ టెక్నాలజీ కంపెనీ ‘లెనొవో’ భారత్‌లో సరికొత్త ల్యాప్‌టాప్‌ను రిలీజ్ చేసింది. యోగా సిరీస్‌లో భాగంగా ‘యోగా ప్రో 7ఐ’ ల్యాప్‌టాప్‌ను తీసుకొచ్చింది. ప్రపంచవ్యాప్తంగా మార్చిలోనే విడుదలైన ఈ ల్యాప్‌టాప్.. తాజాగా భారత్‌లో అందుబాటులోకి వచ్చింది. మల్టీటాస్కింగ్‌ కంటెంట్‌ క్రియేటర్లను దృష్టిలో ఉంచుకొని కంపెనీ దీన్ని రూపొందించింది. ఇంటెల్‌ కోర్‌ అల్ట్రా 7 ప్రాసెసర్‌, ఎన్విడియా జీఈఫోర్స్‌ ఆర్‌టీఎక్స్ 4050 జీపీయూతో యోగా ప్రో 7ఐ వస్తోంది.

లెనొవో యోగా ప్రో 7ఐ ల్యాప్‌టాప్‌ ధర రూ.1.5 లక్షలుగా ఉండడం గమనార్హం. అల్యూమినియం ఛాసిస్‌, బ్యాక్‌లిట్‌ కీ బోర్డుతో ల్యాప్‌టాప్‌కు ప్రీమియం లుక్‌ వచ్చింది. కృత్రిమ మేధ ఫీచర్ల కోసం ప్రత్యేకంగా ‘కోపైలట్‌ కీ’ని పొందుపర్చారు. ఇందులో 120Hz రీఫ్రెష్‌ రేటు, డాల్బీ విజన్‌ కంటెంట్‌ సపోర్ట్‌, ఓలెడ్‌ స్క్రీన్‌తో కూడిన 14 ఇంచెస్ (1800×2880 pixels) డిస్‌ప్లే ఉంటుంది. 16GB డ్యూయల్‌ ఛానెల్‌ ర్యామ్‌, 1టీబీ వరకు స్టోరేజ్‌ ఉంది. ఇది టీల్ బ్లూ రంగులో అందుబాటులో ఉంది. ఈ ల్యాప్‌టాప్‌ బరువు సుమారు 2 కిలోలు.

Also Read: OPPO F27 Pro Plus 5G Price: మొదలైన సేల్.. ఒప్పో ఎఫ్27 ప్రో ప్లస్‌పై భారీ డిస్కౌంట్!

యోగా ప్రో 7ఐ ల్యాప్‌టాప్‌ విండోస్‌ 11 హోమ్‌తో రన్ అవుతుంది. మైక్రోసాఫ్ట్‌ ఆఫీస్‌ హోమ్‌, స్టూడెంట్‌ 2021 ఎడిషన్‌ను ఇందులో ఇచ్చారు. మల్టీమీడియా అనుభూతి కోసం డాల్బీ అట్మోస్‌ సపోర్ట్‌తో కూడిన క్వాడ్‌ స్పీకర్‌, హెచ్‌డీ ఆడియో చిప్‌ ఉంది. క్వాడ్‌ మైక్‌, డెప్త్‌ సెన్సర్‌తో కూడిన ఫుల్‌ హెచ్‌డీ ఐఆర్‌ కెమెరా కూడా ఉన్నాయి. ‘విండోస్‌ హలో’ సపోర్ట్‌ కూడా ఉంది. ఈ ల్యాప్‌టాప్‌ను మీరు 360 డిగ్రీలు మడవలేరు.

Show comments