NTV Telugu Site icon

Heart Attack : ఈ టీని రోజూ తాగితే హార్ట్ ఏటాక్ జన్మలో రాదు.. ఆ సమస్యలు పరార్..

Lemon Tea

Lemon Tea

టీ, కాఫీ లు తాగని వాళ్లు అసలు ఉండరేమో.. పొద్దున్నే గొంతులో టీ పడితే చాలు ఇక రోజంతా హాయిగా గడుస్తుందని చాలా మంది అనుకుంటారు.. అయితే రకరకాల టీని తాగుతుంటారు. కొన్ని రకాల టీలను తాగడం వల్ల అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అందులో ఈరోజుల్లో ఎక్కువగా లెమన్ గ్రాస్ టీని ఎక్కువగా జనాలు తాగుతున్నారు.. ఈ టీని రోజు తాగడం వల్ల గుండె సంబంధిత సమస్యలు దూరం అవుతాయని నిపుణులు చెబుతున్నారు..

నిమ్మగడ్డితో తయారు చేసిన ఈ టీని తాగడం వల్ల ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలను పొందవచ్చు.. ఆయుర్వేదంలో కూడా ఎక్కువగా గడ్డిని వాడి అనేక వ్యాధులకు చెక్ పెడుతున్నారు.. లెమన్ గ్రాస్ టీ తాగితే పొట్టలో అల్సర్లు తగ్గిపోతాయి. బీపీ తగ్గుతుంది. అధిక బరువు తగ్గుతారు. కొలెస్ట్రాల్ లెవల్స్ అదుపులోకి వస్తాయి. జీవక్రియలు నియంత్రించబడతాయి. దీంతో శరీరంలో పేరుకుపోయిన వ్యర్థాలు బయటకు వెళ్లిపోతాయి. అలాగే చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఉన్నా దూరం అవుతాయి.. గుండె ఆరోగ్యం మెరుగు పడుతుంది..

ఈ టీని ఎలా తయారు చేసుకోవచ్చు అంటే?

ముందుగా ఈ గ్రాస్ ను శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి.. గిన్నెలో నీళ్లు పోసి స్టవ్‌ మీద ఉంచి బాగా మరిగించుకోవాలి. అందులో నిమ్మగడ్డి వేసి మరో 10 నిమిషాలు మరిగించి, ఆవిరి బయటికి రాకుండా మూతపెట్టేయాలి.. ఆ తర్వాత ఒక గ్లాస్ లోకి తీసుకొని తేనె లేదా బెల్లం వేసుకొని తాగొచ్చు.. ఈ టీని తీసుకుంటే క్యాన్సర్ దూరం అవుతుంది. హార్ట్ ఎటాక్ రాకుండా రక్షిస్తుంది.. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది..

నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.