Jananayagan : ‘జననాయగన్’ సినిమాను సోషల్ మీడియాలో షేర్ చేస్తే చట్టపరమైన చర్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కోలీవుడ్ సూపర్ స్టార్ విజయ్ దళపతికి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రెండు దశాబ్దాల సినీ ప్రస్థానంలో అశేషమైన అభిమాన గణాన్ని సంపాదించుకున్న ఆయన, రాజకీయాల్లోకి ప్రవేశించి ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారారు. అయితే, రాజకీయాలపై దృష్టి పెట్టేందుకు సినిమాలకు గుడ్ బై చెప్పాలని నిర్ణయించుకున్న విజయ్.. తన చివరి చిత్రంగా ‘జననాయగన్‘ చేస్తున్నారు. ఈ సినిమా కోసం అభిమానులు కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తుంటే తాజాగా చిత్ర యూనిట్‌కు కోలుకోలేని దెబ్బ తగిలింది.
Also Read : Vaazha 2 : బడ్జెట్ రూ. 10 కోట్లు.. కలెక్షన్స్ రూ. 100 కోట్లు మలయాళంలో సెకండ్ హిట్ అందుకున్న సాహు గారపాటి
Also Read
- 1.5K 144Hz OLED డిస్ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
- Telangana Irrigation: రైతులకు గుడ్‌న్యూస్.. జూరాల నుంచి దశలవారీగా నీటి విడుదలకు ప్రభుత్వం ప్లాన్..!
- BIS Certification: మొబైల్ స్క్రీన్ ప్రొటెక్టర్లపై కేంద్రం కొత్త రూల్.. ఇక నాసిరకం టెంపర్డ్ గ్లాస్‌కు చెక్..!
- India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
మొదట ఈ సినిమాకు సంబంధించిన ఒక 5 నిమిషాల నిడివి గల వీడియో క్లిప్ సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. అందులో విజయ్ ఇంట్రడక్షన్ సీన్ హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ ఉండటంతో మేకర్స్ షాక్‌కు గురయ్యారు. అది చిన్న లీక్ అనుకునేలోపే, మొత్తం సినిమా 4K HD వెర్షన్ పైరసీ వెబ్‌సైట్లలో ప్రత్యక్షం కావడంతో పరిస్థితి తీవ్రంగా మారింది. ఇప్పటికే సెన్సార్ బోర్డు సమస్యలు ఇతర న్యాయపరమైన చిక్కులతో 2026 ప్రారంభంలో విడుదల కావాల్సిన ఈ సినిమా వాయిదా పడుతూ వస్తోంది. ఇప్పుడు ఏకంగా సినిమానే లీక్ అవ్వడం చిత్ర పరిశ్రమలో కలకలం సృష్టిస్తోంది.ఈ లీకులపై కె.వి.ఎన్ (KVN) ప్రొడక్షన్స్ సంస్థ ఇంకా అధికారిక ప్రకటన విడుదల చేస్తూ సోషల్ మీడియా వేదికగా సినిమా క్లిప్పులను షేర్ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ‘జననాయగన్’ సినిమాను సోషల్ మీడియాలో షేర్ చేసినా లేదా ప్రసారం చేసినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని KVN నిర్మాణ సంస్థ తరపు లాయర్ స్పష్టం చేసారు. అభిమానులు కూడా ఈ అక్రమ చర్యలను అరికట్టాలని తమ అభిమాన హీరో చివరి సినిమాను థియేటర్లలోనే చూడాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ చర్యలు విజయ్ అభిమానులను అయోమయానికి గురిచేస్తున్నాయి. ఏదేమైనా ఒక పవర్ ఫుల్ పొలిటికల్ అండ్ యాక్షన్ డ్రామాగా వస్తున్న ‘జననాయగన్’ ఈ అడ్డంకులన్నీ దాటుకుని బాక్సాఫీస్ వద్ద ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.
తాజావార్తలు
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
Telangana Irrigation: రైతులకు గుడ్‌న్యూస్.. జూరాల నుంచి దశలవారీగా నీటి విడుదలకు ప్రభుత్వం ప్లాన్..!
-
Japan vs India: హమ్మయ్య.. బయటపడ్డ భారత్.. పసికూన జపాన్‌పై తృటిలో తప్పిన ఓటమి!
-
BIS Certification: మొబైల్ స్క్రీన్ ప్రొటెక్టర్లపై కేంద్రం కొత్త రూల్.. ఇక నాసిరకం టెంపర్డ్ గ్లాస్‌కు చెక్..!
ట్రెండింగ్
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!
-
Paneer Tomato Rice: బిజీ లైఫ్‌కి బెస్ట్ హెల్తీ చాయిస్.. రెస్టారెంట్ రుచితో కుక్కర్లోనే ఘుమఘుమలాడే ‘పన్నీర్ టమాటో రైస్’ సులువుగా చేసేయండి ఇలా.!
-
Raghav Juyal: ‘ది ప్యారడైజ్’ ఈవెంటా.? లేక రాఘవ్ జుయల్ డ్యాన్స్ షోనా..? డాన్స్‌తో అదరగొట్టేసాడుగా.!
-
100+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో VIVO WATCH 6 స్మార్ట్‌వాచ్ లాంచ్.. ఫీచర్స్, ధర ఇవే.!