Israel strikes: రఫాపై ఇజ్రాయెల్ దాడి.. 15 మంది మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గాజాపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగిస్తోంది. తాజాగా దక్షిణ గాజా నగరంలోని రఫాలో మూడు ఇళ్లపై ఇజ్రాయెల్ వైమానిక దాడులకు పాల్పడింది. అయితే ఈ దాడుల్లో 13 మంది మృతి చెందగా.. పలువురు గాయపడినట్లు వైద్యులు సోమవారం తెలిపారు. అయితే హమాస్ మాత్రం 15 మంది చనిపోయినట్లుగా మీడియాకు వెల్లడించింది. గాజా సిటీలోని ఇళ్లపై ఇజ్రాయెల్ విమానాలు దాడి చేశాయి. ఇజ్రాయెల్‌తో కాల్పుల విరమణ ఒప్పందానికి సంబంధించిన అంశాలను చర్చించడానికి ఇస్లామిస్ట్ గ్రూప్ హమాస్ నాయకులు ప్రయత్నాలు చేస్తున్న తరుణంలో ఈ దాడి జరగడం కలవరం రేపుతోంది. ప్రస్తుతం రఫాలోనే పాలస్తీనీయులు ఆశ్రయం పొందుతున్నారు. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ దాడులకు పాల్పడడం అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.
ఇది కూడా చదవండి: NTR : భార్యతో ముంబైలో ఎన్టీఆర్.. వీడియో వైరల్..
Also Read
- Rahul Gandhi: ‘‘ఎవరూ తప్పించుకోలేరు’’.. మోదీ, షా, భగవత్, జ్ఞానేష్ కుమార్‌పై రాహుల్ గాంధీ తీవ్ర ఆరోపణలు
- Harish Rao: రాష్ట్రంలో ఒకవైపు కరెంట్ కోతలు.. మరోవైపు కరెంటు బిల్లులతో వాతలు..
- Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
- Pakistan Spy Network: నేవీ, రక్షణ సంస్థలే టార్గెట్? ఏపీలో పాక్ స్పై నెట్‌వర్క్ తీవ్ర కలకలం..
గత అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై హమాస్ దాడులకు పాల్పడింది. వందలాది మందిని చంపి.. మరికొందరిని బందీలుగా తీసుకుపోయారు. అనంతరం ప్రతీకారంగా హమాస్‌పై ఇజ్రాయెల్ దాడులకు తెగబడింది. ఇప్పటికే గాజా పట్టణాన్ని సర్వనాశనం చేసింది. అలాగే హమాస్ చెరలో ఇంకా ఇజ్రాయెలీయులు బందీలుగా ఉన్నారు. మరోవైపు ఇరు దేశాల మధ్య విరమణ ఒప్పందాలు జరుగుతున్న తరుణంలో మరోసారి ఎటాక్ చేయడంపై ఆయా దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
ఇదిలా ఉంటే గాజాలో మానవ సాయం అందకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరికొందరు ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ నేపథ్యంలో గాజాలో సాయం చేసేందుకు అమెరికాలో చర్యలో చేపట్టింది. ఈ మేరకు అధ్యక్షుడు బైడెన్, ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు ఫోన్‌లో మాట్లాడుకున్నారు. ఆహార పదార్థాలు, నిత్యావసరాలు సహా ఇతర సహాయ సామగ్రిని అనుమతించేందుకు మరిన్ని దారులను తెరుస్తామని నెతన్యాహు హామీ ఇచ్చారు. ఈవారంలోనే ఆ దిశగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
హమాస్ చెరలో ఉన్న బందీలను వెంటనే విడిచిపెట్టాలని బైడెన్ ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. తద్వారా కాల్పుల విరమణ, గాజా పునఃనిర్మాణం దిశగా ముందడుగు వేయాలని హమాస్‌కు సూచించారు. మరోవైపు ఇజ్రాయెల్ భద్రత విషయంలో అమెరికా ఏ మాత్రం వెనకడుగు వేయబోదని బైడెన్ హామీ ఇచ్చారు. ఇరాన్‌తో ఉద్రిక్తతల సమయంలో అందించిన ఆపన్నహస్తమే అందుకు ఉదాహరణ అని చెప్పుకొచ్చారు.
ఇది కూడా చదవండి: RCB vs GT: నేను హిట్టింగ్ చేయడానికి చేయడానికి కారణం అతడే: విల్ జాక్స్
తాజావార్తలు
-
Rahul Gandhi: ‘‘ఎవరూ తప్పించుకోలేరు’’.. మోదీ, షా, భగవత్, జ్ఞానేష్ కుమార్‌పై రాహుల్ గాంధీ తీవ్ర ఆరోపణలు
-
Harish Rao: రాష్ట్రంలో ఒకవైపు కరెంట్ కోతలు.. మరోవైపు కరెంటు బిల్లులతో వాతలు..
-
Pakistan Cricket: పాకిస్థాన్ క్రికెట్‌కు బిగ్ షాక్.. సగం ధరకే విక్రయం!
-
Lagadapati Sridhar: చిన్న సినిమాలను తొక్కేస్తున్నారా? లగడపాటి శ్రీధర్ సంచలన కామెంట్స్!
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
ట్రెండింగ్
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
Harmanpreet Kaur: హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన నిర్ణయం!