తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి ఉపాధ్యాయ సంఘాల నేతలు వచ్చారు. ఈ సందర్భంగా సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ.. ఉపాధ్యాయ సంఘాల్లో అతిపెద్ద సంఘం పీఆర్టీయూ.. గత ప్రభుత్వంలో రెండుగా విడిపోయాయని తెలిపారు. అంతేకాకుండా.. రెండు ఎమ్మెల్సీలను గెలుచుకున్న గొప్ప సంఘం పీఆర్టీయూ అని అన్నారు. విడిపోయిన నేతలతో మాట్లాడి రెండు సంఘాలు కలిసేలా చూశామని.. ఒప్పందం ప్రకారం విడిపోయిన రెండు సంఘాలు ఏకమయ్యాయని పేర్కొన్నారు. రెండు సంఘాలు కలవడం వల్ల బలం పెరిగింది.. రాష్ట్రంలో వాలంటీర్లు ఎక్కడా సమ్మె చేయడం లేదని వెంకట్రామిరెడ్డి తెలిపారు.
IND vs SA: భారత్-సౌతాఫ్రికా తొలి టెస్ట్.. 408 పరుగులకు దక్షిణాఫ్రికా ఆలౌట్
రాష్ట్రంలో కమ్యునిస్టు సంఘాలు కావాలని కొందరు వాలంటీర్లను రెచ్చగొట్టి ఆందోళన చేయిస్తున్నారు.. రాష్ట్ర ప్రభుత్వాన్ని బదనాం చేసేందుకే కమ్యూనిస్టులు ఇలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. వాలంటీర్లు అందరూ జగన్ సైన్యమేనని ఆయన తెలిపారు. పాదయాత్ర సమయంలో సీఎం చెప్పిందంతా చేశారు.. ఆర్థిక సమస్యల వల్ల సీఎం జగన్ ఉద్యోగులకు చెప్పిన వాటిల్లో కొన్ని చేయలేకపోయారని అన్నారు. మళ్లీ సీఎం గా జగన్ అవుతారు.. వాలంటీర్లకు వేతనాలు పెంచే విషయమై సీఎం ఆలోచిస్తున్నారు.. సందర్భం వచ్చినపుడు వాలంటీర్లకు వేతనాలను సీఎం పెంచుతారని వెంకట్రామిరెడ్డి పేర్కొన్నారు.
Vaishnavi Chaitanya: దిల్ రాజు వారసుడి కోసం బేబీ రంగంలోకి దిగిందోచ్
మరోవైపు.. పీఆర్టీయూ అధ్యక్షుడు కృష్ణయ్య మాట్లాడుతూ, ఉపాధ్యాయ లోకానికి ఇబ్బందులు ఉన్నాయని అన్నారు. పాత పించన్ విధానాన్ని అమలు పరచాలని కోరుతున్నాం.. వేతన బకాయిలు విడుదల చేయాలని కోరుతున్నామన్నారు. 2004 కు ముందు జాయిన్ అయిన వారికి పాత పింఛన్ ఇవ్వాలని తెలిపారు. రాబోయే రోజుల్లో ఉపాధ్యాయులకు మంచి జరుగుతుందని పీఆర్టీయూ సెక్రటరీ గాదె శ్రీనివాసులు నాయుడు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వంతో సత్సంబంధాలు నెలకొల్పుకుంటాం.. మాలో మాకు విభేధాలు ఉండటం వల్ల మా సమస్యలను ప్రభుత్వం ముందుకు సరిగా తీసుకెళ్లలేకపోయామని తెలిపారు. ఇకపై మా రెండు సంఘాలు ఏకమైనందున వెంకట్రామిరెడ్డి ద్వారా సమస్యలను సీఎం దృష్టికి తీసుకుపోతామని చెప్పారు. సీఎం దృష్టికి తీసుకు వెళ్లి ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని పేర్కొన్నారు.