Site icon NTV Telugu

HAL Clarifies: తేజస్ విమానం కూలిపోలేదు.. అసలు నిజం ఇదే: పుకార్లపై హెచ్ఏఎల్ స్పష్టత

Tejas Fighter Jet

Tejas Fighter Jet

HAL Clarifies: ఇటీవల సోషల్ మీడియాలో, అలాగే కొన్ని మీడియా సంస్థల్లో తేజస్ యుద్ధ విమానం కూలిపోయిందనే వార్తలు వచ్చాయి. దీనిపై హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL) తాజాగా స్పందిస్తూ, ఆ వార్తల్లో నిజం లేదని తేల్చి చెప్పింది. అసలేం జరిగిందంటే.. ఫిబ్రవరి 7న ఒక శిక్షణ ముగించుకుని తిరిగి వస్తున్న సమయంలో, విమానం బ్రేకులు సరిగ్గా పనిచేయకపోవడం వల్ల రన్‌వేను దాటి ముందుకు వెళ్లింది. ఆ సమయంలో పైలట్ సురక్షితంగా బయటకు దూకారు. ఇది కేవలం ఒక చిన్న సాంకేతిక సమస్యే తప్ప, విమానం కూలిపోలేదని HAL స్పష్టం చేసింది.

READ ALSO: Last Words Before D*eath: ప్రాణాలు విడిచే ముందు ప్రజలు చెప్పే చివరి మాటలు ఇవే..!

ప్రపంచంలోని ఆధునిక యుద్ధ విమానాల్లో ‘తేజస్’ అత్యుత్తమ సెఫ్టీ రికార్డును కలిగి ఉందని, అనవసరమైన భయాందోళనలు చెందవద్దని HAL కోరింది. ఈ సంఘటన తర్వాత, భారత వైమానిక దళం (IAF) తమ వద్ద ఉన్న దాదాపు 30 తేజస్ జెట్‌లను క్షుణ్ణంగా తనిఖీ చేయడం కోసం తాత్కాలికంగా నిలిపివేసింది. సమస్య ఎక్కడుందో తెలుసుకోవడానికి IAF, HAL కలిసి పనిచేస్తున్నాయి. అమెరికాకు చెందిన GE ఏరోస్పేస్ కంపెనీ నుంచి ఇంజిన్ల సరఫరా ఆలస్యం కావడం వల్ల, కొత్త విమానాల డెలివరీలో కొంత జాప్యం జరుగుతోందని తెలుస్తుంది.

ఇదే సమయంలో భారత ప్రభుత్వం తేజస్ విమానాల కోసం భారీ పెట్టుబడులు పెట్టింది. 2021లో 83 తేజస్ Mk-1A జెట్ల కోసం ప్రభుత్వం రూ.48,000 కోట్ల ఒప్పందం కుదుర్చుకోగా, 2025 సెప్టెంబర్‌లో మరో 97 విమానాల కోసం రూ.62,370 కోట్ల భారీ ఒప్పందం కుదిరింది. వాస్తవాలు తెలియకుండా తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయవద్దని హెచ్ఏఎల్ కోరింది. దేశీయంగా తయారైన ఈ యుద్ధ విమానం అత్యంత సురక్షితమైనదని అధికారులు వెల్లడించారు.

READ ALSO: Anil Ambani: అంబానీకి షాక్ ఇచ్చిన బాంబే హైకోర్టు..

Exit mobile version