తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎంగా భట్టి విక్రమార్క మల్లు, మంత్రులుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దామోదర్ రాజనర్సింహ, శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, సీతక్క, తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు ప్రమాణ స్వీకారం చేశారు. వారి చేత గవర్నర్ తమిళి సై ప్రమాణం చేయించారు. అయితే.. అందరూ మంత్రులు ప్రమాణం చేస్తున్న సమయంలో రాని క్రేజ్.. ములుగు ఎమ్మెల్యే సీతక్క మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలో ఎల్బీ స్టేడియం దద్దరిల్లిపోయింది.
Read Also: Kodali Nani: తెలంగాణలో జనసేన, బీజేపీ పొత్తు, ఎన్నికల ఫలితాలపై కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు..
సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం తర్వాత సీతక్కకే భారీ స్పందన వచ్చింది. రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు వినిపించిన జనం అరుపుల కంటే సీతక్క మంత్రిగా ప్రమాణం చేస్తున్న సమయంలో భారీగా కేరింతలు వినిపించాయి. ఆమే మైక్ ముందుకి రాగానే కార్యకర్తలు, అభిమానులు కేరింతలు కొట్టడంతో కాసేపు ఆమే మాట్లాడకుండా వేచి చూడాల్సి వచ్చింది. ఆ స్పందన చూసి వేదికపై ఉన్న గవర్నర్ తమిళిసై ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత గవర్నర్ తమిళిసై సీతక్క చేత ప్రమాణం చేయించారు.
Read Also: Janhvi Kapoor: ఆ డైరెక్టర్ తో జాన్వీకపూర్.. పూజలు చేస్తున్న పిక్స్ వైరల్..