NTV Telugu Site icon

Laxmi Parvati : ఎన్టీఆర్ ఆశీస్సులు జగన్ మోహన్ రెడ్డికి అందాలని కోరుకుంటున్న

Laxmi Parvathi

Laxmi Parvathi

ఎన్టీఆర్‌ 101వ జయంతిని పురస్కరించుకొని.. ఆయన కుటుంబ సభ్యులు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన సతీమణి, వైఎస్సార్‌సీపీ నేత లక్ష్మీ పార్వతి ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జూన్ 4 తర్వాత ఏపీలో మళ్లీ జగన్ పరిపాలన రాబోతుందన్నారు.. అందుకు ఎన్టీఆర్ ఆశీస్సులు జగన్ మోహన్ రెడ్డికి అందాలని కోరుకుంటున్నానన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి మంచి పరిపాలనే నడుస్తుందని ఈ సందర్భంగా ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. ‘‘వైఎస్‌ జగన్‌కు ఎన్టీఆర్‌ ఆశీస్సులు ఉన్నాయి. జూన్‌ 4 తర్వాత జగన్‌ సీఎంగా ప్రమాణం చేస్తారు. ఏపీలో మళ్లీ మంచి పరిపాలన వస్తుంది’’ అని అన్నారామె. అంతకు ముందు.. మనవళ్లు జూనియర్‌ ఎన్టీఆర్‌, కల్యాణ్‌ రామ్‌లు ఎన్టీఆర్‌కు నివాళులర్పించారు. తెల్లవారుజామునే ఘాట్‌ వద్దకు చేరుకుని తాతను స్మరించుకున్నారు.

అంతకుముందు.. ఎన్టీఆర్ మనవళ్లు జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ కలిసి ఉదయమే ఎన్టీఆర్ ఘాట్ వద్దకు చేరుకున్నారు. అయితే తమ అభిమాన నటుడు ఈరోజు తాతకు నివాళి అర్పించేందుకు వస్తాడని జూ.ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు తెలుసు. దీంతో ఉదయమే వారు కూడా అక్కడికి చేరుకున్నారు. ఇలా జూ.ఎన్టీఆర్ వచ్చిన సమయంలో ఆ ప్రాంతంలో సందడి నెలకొంది. ఇక సోదరుడు కల్యాణ్ రామ్ తో కలిసి తాత సమాధి వద్ద ఎన్టీఆర్ నివాళులు అర్పిస్తుండగా సీఎం… సీఎం అంటూ ఫ్యాన్స్ నినాదాలు చేసారు. ఇలా ఎన్టీఆర్ ఘాట్ వద్ద జూ.ఎన్టీఆర్ వున్నంతసేపు ఈ నినాదం మారుమోగుతూనే వుంది. ఇలా ఎన్టీఆర్ ఫ్యాన్స్ సీఎం నినాదాలు రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది.