NTV Telugu Site icon

Be Alert : వసూల్‌ రాజానా.. మజాకా..!

Laxman

Laxman

అతడు ఓ బ్రోకర్‌.. పోలీసులు గట్టిగా వాడుకున్నారు. పోలీసుల అండదండలతో అన్నీ నేర్చుకున్నారు. ఎవరిని ఎలా డీల్‌ చేయాలనేదీ బాగా వంటపట్టించుకున్నాడు. లోసుగులు అన్నీ తెలిసాయి.. ఇంకేముంది.. చెలరేగిపోయాడు… రాజకీయ నాయకుడి అవతారం ఎత్తి.. తానకంటూ ఓ పరిధిని ఏర్పాటు చేసుకున్నాడు. అందులో ఉన్న ఎవడైనా సరే.. అతడికి కప్పం కట్టాల్సిందే.. లేదంటే వ్యవహారం మామూలుగా ఉండదు.. అతడి పోరు పడలేకనే తమను రక్షించండి బాబోయ్‌ అంటూ వేడుకుంటున్నారు బాధితులు. వివరాల్లోకి వెళితే.. లక్ష్మణ్‌ అనే వ్యక్తి పోలీసులకు, బార్లు, రెస్టారెంట్‌, పబ్‌ యాజమాన్యాలకు మధ్యవర్తిత్వం చేసేవాడు. అయితే.. ఇలాగే కొనసాగిన లక్ష్మణ్ తనే దందా మొదలుపెట్టాడు. ఒకటో తారీఖునే సిబ్బందికి జీతాలు ఇచ్చిన ఇవ్వకున్నా.. లక్ష్మణ్‌కు మాత్రం కప్పం కట్టాల్సిందే. లేకుండా.. పోలీసులతో రైడ్‌ చేయిస్తానని, నార్కోటిక్స్‌ బృందంతో తనిఖీలు చేయిస్తానంటూ బెదిరింపులకు దిగే వాడు. దీంతో బెదిరిని పబ్‌ యజామానులు లక్ష్మణ్‌కు డబ్బులు ఇచ్చేవారు. అయితే.. ఈ తంతు రానురాను పెరిగిపోవడంతో విసిగిపోయిన బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వెలుగులోకి వచ్చింది ఈ ఘటన.