NTV Telugu Site icon

Raghava Lawrence : ‘కాంచన 4’ రూమర్స్ పై క్లారిటీ ఇచ్చిన లారెన్స్.

Kanchana 4

Kanchana 4

Raghava Lawrence : కోలీవుడ్ హీరో రాఘవ లారెన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.కొరియోగ్రాఫర్ గా కెరీర్ మొదలు పెట్టిన లారెన్స్ హీరోగా,దర్శకుడిగా వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు.లారెన్స్ గత ఏడాది చంద్రముఖి 2 ,జిగర్ తండా డబల్ ఎక్స్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.అయితే ఆ సినిమాలు ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేదు.దీనితో తనకు దర్శకుడిగా ఎంతో ఆదరణ తీసుకొచ్చిన కామెడీ హారర్ జోనర్ లో మరో సినిమా తెరకెక్కిస్తున్నాడు.లారెన్స్ తెరకెక్కించిన కాంచన సినిమా అప్పట్లో ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు .ఆతరువాత వచ్చిన కాంచన 2 ,కాంచన త్రీ సినిమాలు కూడా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.

Read Also :Game Changer : గేమ్ ఛేంజర్ లో రాంచరణ్ పాత్ర ఎలా ఉంటుందంటే..?

తాజాగా “కాంచన 4 ” సినిమాను తెరకెక్కిస్తున్నట్లు మేకర్స్ ఇటీవల ప్రకటించారు.ఇదిలా ఉంటే ఈ సినిమాలో స్టార్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తున్నట్లు ఓ వార్త సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.అయితే తాజాగా ఈ సినిమా గురించి వస్తున్నరూమర్స్ పై లారెన్స్ స్పందించారు.హీరోయిన్ మృణాల్ ఠాకూర్ ఈ సినిమాలో నటిస్తున్నట్లు వస్తున్న వార్తలు అవాస్తవం.అలాంటివి అస్సలు నమ్మొద్దు. కాంచ‌న 4లో న‌టించే న‌టీన‌టుల వివ‌రాల‌ను రాఘవేంద్ర ప్రొడక్షన్‌ ద్వారా అధికారికంగా వెల్ల‌డిస్తామ‌ని త్వ‌ర‌లోనే ఈ సినిమాకు సంబందించిన వివ‌రాలు తెలియ‌జేస్తామ‌ని లారెన్స్ ట్వీట్ చేశాడు.

Show comments