NTV Telugu Site icon

Lavu Sri Krishna Devaraya: ఎన్టీఆర్, ఏఎన్‌ఆర్‌కి నిజమైన వారసుడు చిరంజీవి.. వారిని ఏ ఒక్క వర్గానికి పరిమితం చేయొద్దు..

Lavu Sri Krishna Devaraya

Lavu Sri Krishna Devaraya

Lavu Sri Krishna Devaraya: ఎన్టీఆర్, ఏఎన్‌ఆర్‌కి నిజమైన వృత్తి వారసుడు మెగాస్టార్‌ చిరంజీవియే అన్నారు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయ.. విశాఖపట్నంలోని ఋషికొండలో నిర్వహించిన ఎన్టీఆర్‌ 28వ వర్ధంతి, ఏఎన్ఆర్ శత జయంతి కార్యక్రమం నిర్వహించారు.. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు మెగాస్టార్ చిరంజీవి.. లోక్ నాయక్ ఫౌండేషన్ అధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు మాజీ ఎంపీ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్.. ఇక, ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయ మాట్లాడుతూ.. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ కి నిజమైన వృత్తి వారసుడు మెగాస్టార్ చిరంజీవియే అని కొనియాడారు.. మెగాస్టార్ చిరంజీవి వలన తెలుగు చిత్ర పరిశ్రమకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు వచ్చిందని ప్రశంసలు కురిపించారు. రాజకీయ నాయకుడు ప్రజల్లో ఉండాలని అంకురార్పణ చేసింది మాత్రం ఎన్టీఆరే అని గుర్తుచేశారు. ఇక, ఎన్టీఆర్, ఏఎన్ఆర్, చిరంజీవిని ఏ ఒక్క వర్గానికి పరిమితం చేయొద్దు అని విజ్ఞప్తి చేశారు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయ.

Read Also: Shoaib Malik : షోయబ్ మాలిక్ మూడో పెళ్లి.. ఓ రేంజ్ లో ఆడుకుంటున్న నెటిజన్స్

ఇక, ఈ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ.. ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. నా బయోగ్రఫీ రాసే బాధ్యత యండమూరికి అప్పగిస్తున్నాను అన్నారు. సమకాలీన రచయితలలో యండమూరికి ఎవరూ సాటిలేర్న ఆయన.. నా బయోగ్రఫీ రాసే సమయం నాకు ఉండదు.. యండమూరి అభిలాష సినిమాతోనే పరిశ్రమలో నా స్థానం పదిలం అని ఫిక్స్ అయ్యానని గుర్తుచేసుకున్నారు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ మాలాంటి వారికి దైవ సమానులు.. వారితో కలిసి నటించడం నా పూర్వజన్మ సుకృతం.. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ లతో అనుభవాలు మర్చిపోలేను అన్నారు. మరోవైపు ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయను ప్రశంసించారు చిరంజీవి.. ప్రజాసేవ తప్ప సంపాదనపై ధ్యాస లేని ఎంపీగా లావు నాకు కనిపించారని పేర్కొన్నారు మెగాస్టార్‌ చిరంజీవి.