NTV Telugu Site icon

Raj Tarun – Lavanya: బాంబు పేల్చిన లావణ్య.. రాజ్ తరుణ్ చచ్చాడని వదిలేస్తున్న.. కానీ.?

Lavanya

Lavanya

Raj Tarun – Lavanya: తెలుగు చిత్ర పరిశ్రమలో గత కొద్ది రోజుల నుంచి హీరో రాజ్ తరుణ్ అతడి మాజీ ప్రియురాలు లావణ్య గురించి అనేక సంఘటనలు రోజు మీడియా పూర్వకంగా తెలుసుకుంటూనే ఉన్నాము. ఈ విషయంలో మొదటగా తాను రాజ్ తరుణ్ మాజీ ప్రియురాలని తనని అతడు పెళ్లి చేసుకున్నాడని.. ఏకంగా అబార్షన్ కూడా చేయించడం లాంటి ఆరోపణలు చేసింది. అంతేకాదు, హీరో రాజ్ తరుణ్ మాల్వి మల్హోత్రాతో ఎఫైర్ నడిపిస్తున్నాడని అందువల్లే తనను విడిచిపెట్టాడంటూ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసింది. ఈ విషయంపై తాజాగా స్పందించిన మాల్వి మల్హోత్ర ఆవిడ క్రిమినల్స్ తో పాటు తిరుగుతోందని.. ఆమె కూడా ఓ పెద్ద క్రిమినల్ అంటూ కామెంట్ చేసింది. ఇక ఈ విషయంపై హీరో రాజ్ తరుణ్ స్పందిస్తూ.. లావణ్యతో తాను రిలేషన్ లో ఉన్న విషయం కరెక్టే కాని ఆమెను పెళ్లి చేసుకోలేదని తెలియజేశాడు. ఇకపోతే., ఆవిడ డ్రగ్స్ తీసుకున్న కేసులో జైలుకు వెళ్లి వచ్చిందని అందుకే ఆమెకు దూరంగా ఉన్నట్లు ఆయన తెలిపాడు.

Committee Kurrollu: మెగా ఫ్యామిలీ నుంచి నిహారికకు సపోర్ట్ అందట్లేదా..? అసలు విషయం అదేనా..?

ఇలా అనేక విషయాల నేపథ్యంలో తాజాగా లావణ్య పై రాజ్ తరుణ్ పేరెంట్స్ మాదాపూర్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిన తర్వాత.. మరో ఊహించని ట్విస్ట్ ఇప్పుడు నెలకొంది. హీరో రాజ్ తరుణ్ తనకి వద్దని లావణ్య ఓ బాంబు పేల్చింది. ఈ విషయంపై నాలుగు గోడల వద్ద జరిగిన గొడవను నేను బయటకి తీసుకువచ్చానని., నాకు కనీసం సహాయం దొరుకుతుందని భావించానని.. అయితే ఈ విషయం గురించి నేను ఎక్కడా కూడా రాజ్ తరుణ్ తప్పుగా మాట్లాడలేదంటూ తెలుపుతూనే.. రాజ్ తనతో ఎలాంటి సంబంధం లేదని చెబుతున్నాడని.. పెళ్లి చేసుకోలేదని కూడా చెబుతున్నాడని.. అతడు ఇన్ని మాటలు మాట్లాడినా.. తర్వాత నేను కూడా అతని లాగానే అనుకుంటునట్లు తెలిపింది. అతని కోసం తాను చాలా పోరాడని ఇప్పుడు వద్దని అనుకుంటునట్లు తెలిపింది లావణ్య.

Exclusive: పెరిగిన రైల్వే వ్యయం..సేవలు అధ్వానం..రైల్వేలో ఏం జరుగుతోంది?

ఇక ఇన్ని రోజులు ఒక అమ్మాయితో పెళ్లి చేసుకోకుండా ఉండడమంటే.. అది అత్యాచారం కిందికే వస్తుందని., అతను ఆ సెక్షన్ కి కట్టుబడి ఉండాలంటూ పేర్కొంది. రాజ్ తన స్నేహితుడు శేఖర్ భాషతో తనపై చేయించిన ఆరోపణలు కూడా నన్ను మరింతగా బాధించాయని ఆ విషయం పట్ల రాజ్ తరుణ్ కూడా జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి వస్తుందంటూ తెలిపింది. రాజ్ తరుణ్ తో తాను దాదాపు 11 ఏళ్లు ఉన్నానని.. అందుకోసమే వారి ఇంటికి వెళ్ళానని.. అందుకు బదులుగా వారు న్యూసెన్స్ కేసు పెట్టినట్లు తెలిపింది. ఇకపోతే ఇప్పుడు తరుణ్ ను తాను వద్దనుకుంటున్నానని., నేను కూడా బలవంతంగా అతనిని నేను నా దగ్గరకు తీసుకురాలేనని., అతడు నా జీవితంలో లేడు అనుకోని అతడి ఫోటోకు దండేసి బ్రతికేస్తాను అన్నట్లు తెలుపుతూనే.. నాకు మాత్రం న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాను అంటూ లావణ్య చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Show comments