Lava Virat V1 5G, Virat V1 Launch: దేశీయ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ లావా (Lava) తన కొత్త Virat V1 సిరీస్ స్మార్ట్‌ఫోన్లను భారత మార్కెట్లోకి తీసుకవచ్చింది. ఇందులో Lava Virat V1 5G, Lava Virat V1 అనే రెండు మోడళ్లను లాంచ్ చేసింది. ఫ్లిప్కార్ట్ (Flipkart)తో కలిసి రూపొందించిన ఈ సిరీస్‌ను విద్యార్థులు, యువ ఉద్యోగులు, తక్కువ ధరలో మంచి ఫీచర్లు కోరుకునే వినియోగదారులను దృష్టిలో పెట్టుకుని తీసుకొచ్చింది.
Lava Virat V1 5G:
Lava Virat V1 5Gలో 6.75 అంగుళాల HD+ (720×1600 పిక్సెల్స్) డిస్‌ప్లేను అందించారు. ఇది 120Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. ఫోన్‌కు UNISOC T8200 ప్రాసెసర్ ఉండగా, 4GB RAMతో పాటు 4GB వర్చువల్ RAM సపోర్ట్ ఉంది. ఇందులో 64GB ఇంటర్నల్ స్టోరేజ్ లభిస్తుంది. మైక్రోSD కార్డ్ ద్వారా 1TB వరకు స్టోరేజ్‌ను విస్తరించుకోవచ్చు.
ఈ ఫోన్ Android 16 ఆధారంగా పనిచేస్తుంది. కంపెనీ ఇందులో ఎలాంటి ప్రకటనలు (Ads) అవసరం లేని యాప్‌లు (Bloatware) ఉండవని తెలిపింది. ఫోటోగ్రఫీ కోసం 13MP AI డ్యూయల్ రియర్ కెమెరా, సెల్ఫీల కోసం 5MP ఫ్రంట్ కెమెరాను అందించారు. అలాగే 6000mAh భారీ బ్యాటరీ, 10W ఛార్జింగ్, IP64 డస్ట్ & స్ప్లాష్ రెసిస్టెన్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
Lava Virat V1:
బడ్జెట్ వినియోగదారుల కోసం తీసుకొచ్చిన Lava Virat V1లో కూడా 6.75 అంగుళాల HD+ డిస్‌ప్లేనే అందించారు. అయితే ఇందులో 90Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. ఈ ఫోన్‌కు UNISOC SC9863A ప్రాసెసర్ శక్తినిస్తుంది. 4GB RAM, 64GB స్టోరేజ్, 1TB వరకు మైక్రోSD సపోర్ట్ ఇందులో కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ ఫోన్ Android 15 Go Editionపై పనిచేస్తుంది. ఇందులో కూడా Ads, Bloatware ఉండవని కంపెనీ తెలిపింది. ఫోటోగ్రఫీ కోసం 13MP AI డ్యూయల్ కెమెరా, 5MP సెల్ఫీ కెమెరాను అందించారు. పవర్ బ్యాకప్ కోసం 5000mAh బ్యాటరీ, 10W ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. ఈ మోడల్‌కు కూడా IP64 రేటింగ్ లభించింది.
ధరలు:
Lava Virat V1 5Gను ఆర్య బ్లూ, సోనార్ గోల్డ్ రంగుల్లో విడుదల చేయగా.. Lava Virat V1ను నీలగిరి బ్లూ, హిమాలయన్ సిల్వర్ కలర్ ఆప్షన్లలో అందిస్తున్నారు. ఇక ధరల విషయానికి వస్తే.. Lava Virat V1 5G సాధారణ ధర రూ.12,999 కాగా ప్రత్యేక లాంచ్ ఆఫర్స్ లో రూ. 11,999 కాగా.. Lava Virat V1 సాధారణ ధర రూ.9,999 కాగా లాంచ్ ఆఫర్ కింద రూ.8,999 లేక్ లభించనుంది. ఈ ప్రత్యేక ధరలు జూలై 31న మాత్రమే వర్తిస్తాయని కంపెనీ తెలిపింది. వీటి అమ్మకాలు జూలై 31 మధ్యాహ్నం 12 గంటల నుంచి ఫ్లిప్కార్ట్, లావా అధికారిక వెబ్‌సైట్‌లో కొనుగోలుకు అందుబాటులో ఉంటాయి. వీటితో పాటు కంపెనీ Free Service@Home సేవను కూడా అందిస్తోంది.

