Site icon NTV Telugu

Lava Storm 5G Price: మార్కెట్‌లోకి లావా స్టార్మ్‌ 5జీ.. సూపర్ కెమెరా, ఫాస్ట్‌ ఛార్జింగ్‌!

Lava Storm 5g Price

Lava Storm 5g Price

Lava Storm 5G launched in India under Rs 15000: దేశీయ మొబైల్‌ తయారీ కంపెనీ ‘లావా’ మరో 5జీ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. అదే ‘లావా స్టార్మ్‌ 5జీ’. ఈ ఫోన్ డిసెంబరు 28 నుంచి అందుబాటులో ఉంటుంది. లావా ఇ-స్టోర్‌, అమెజాన్‌ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా ఈ ఫోన్‌ను కొనుగోలు చేయొచ్చని కంపెనీ తెలిపింది. వినియోగదారులకు ఆకర్షణీయమైన బ్యాంక్ ఆఫర్‌లను కూడా అందుబాటులో ఉంచింది. 50 ఎంపీ కెమెరా, ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సదుపాయంతో.. బడ్జెట్‌ ధరలో లావా స్టార్మ్‌ 5జీని కంపెనీ తీసుకొచ్చింది.

లావా స్టార్మ్‌ 5జీ స్మార్ట్‌ఫోన్‌ సింగిల్‌ వేరియంట్‌లో వస్తోంది. 8జీబీ, 128జీబీ ధర రూ.13,499గా లావా కంపెనీ నిర్ణయించింది. ప్రారంభ ఆఫర్‌ కింద కొనుగోలు చేసిన వారికి ఈ ఫోన్ రూ.11,999కే దక్కుతుంది. మైక్రో ఎస్‌డీ కార్డ్‌ ద్వారా స్టోరేజీని 1 టీబీ వరకు పెంచుకోవచ్చని కంపెనీ పేర్కొంది. గేల్ గ్రీన్, థండర్ బ్లాక్ రంగుల్లో ఈ ఫోన్‌ అందుబాటులో ఉంటుంది. డిసెంబరు 28 నుంచి లావా స్టార్మ్‌ 5జీని కొనుగోలు చేయొచ్చు.

Also Read: Nothing Phone 2a: న‌థింగ్ ఫోన్ 2ఏ వచ్చేస్తోంది.. ధర, ఫీచర్లు లీక్!

లావా స్టార్మ్ 5జీ ఫోన్‌ 6.78 ఇంచెస్ ఎఫ్‌హెచ్‌డీ ప్లస్‌ ఐపీఎస్‌ ఎల్‌సీడీ డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేటుతో వస్తోంది. మీడియాటెక్‌ డైమెన్సిటీ 6080 ప్రాసెసర్‌ను ఇందులో అమర్చారు. ఆండ్రాయిడ్‌ 13 ఆధారంగా ఈ ఫోన్ పనిచేస్తుంది. వెనుక వైపు 50 ఎంపీ ప్రధాన కెమెరా, 8 ఎంపీ అల్ట్రా వైడ్‌ యాంగిల్‌ కెమెరా ఉంటాయి. సెల్ఫీల కోసం 16 ఎంపీ కెమెరా ఇచ్చారు. ఈ ఫోన్‌లో 5000mAh బ్యాటరీ ఉండగా.. 33W ఫాస్ట్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేస్తుంది. సైడ్-మౌంటెడ్ అల్ట్రా-ఫాస్ట్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఫేస్ అన్‌లాక్ వంటి టాప్-నాచ్ సెక్యూరిటీ ఫీచర్లతో ఇది వస్తుంది.

Exit mobile version