Lava Blaze X 5G : లావా బ్లేజ్ X 5G భారతదేశంలో విక్రయాలను ప్రారంభించింది. ఇది స్థానిక కంపెనీ లావా కొత్త ఫోన్. ఇది 5G సపోర్ట్ తో వస్తుంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌తో కర్వ్డ్ AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ Dimensity 6300 ప్రాసెసర్ తో వస్తుంది. ఇది మూడు కాన్ఫిగరేషన్లలో కొనుగోలు చేయవచ్చు. లావా బ్లజ్ X 5G డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ను కలిగి ఉంది. దీని ప్రధాన లెన్స్ 64MP. ఇది 5000mAh బ్యాటరీని కలిగి ఉంది. దాని వివరాలు తెలుసుకుందాం.
Samsung Galaxy Watch Ultra : కాస్ట్లి వాచ్‌ను విడుదల చేసిన శాంసంగ్.. ఫీచర్లు మాములుగా లేవుగా..
లావా ఈ ఫోన్ ను 3 కాన్ఫిగరేషన్లలో తీసుక వస్తుంది. లావా బ్లెజ్ X 5G 4GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.14,999. అయితే., 6GB RAM వేరియంట్ ధర రూ.15,999., 8GB RAM వేరియంట్ ధర రూ.16,999. ఈ ఫోన్ స్టార్‌లైట్ పర్పుల్ , టైటానియం గ్రే రంగులలో వస్తుంది. ఈ ఫోన్ జూలై 20న అమ్మకానికి రానుంది. మీరు దీన్ని అమెజాన్, కంపెనీ అధికారిక వెబ్‌సైట్ నుండి కొనుగోలు చేయవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ పై కంపెనీ ఆకర్షణీయమైన ఆఫర్ లను కూడా అందిస్తోంది. లావా బ్లెజ్ X 5Gపై రూ. 1000 తగ్గింపు అందుబాటులో ఉంది.
Madhyapradesh : 13 ఏళ్లకే గర్భిణి.. 35 ఏళ్ల వయసులో 10వ బిడ్డకు జన్మనిచ్చిన గిరిజన మహిళ
లావా బ్లేజ్ ఇది 6.67 అంగుళాల Full HD+ కర్వ్డ్ AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. స్క్రీన్ 120Hz రిఫ్రెష్ రేట్ మద్దతుతో వస్తుంది. ఈ ఫోన్ Android 14 ఆధారంగా రూపొందించబడింది. ఇందులో మీడియాటెక్ Dimensity 6300 ప్రాసెసర్ ఉంది. హ్యాండ్‌సెట్ గరిష్టంగా 8GB RAM, 128GB స్టోరేజ్ తో వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ లో 64MP, 2MP డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ముందు భాగంలో కంపెనీ 16MP సెల్ఫీ కెమెరాను అందించింది. ఈ హ్యాండ్‌సెట్ బ్లూటూత్, Wi-Fi, GPS, OTG, 5G, USB టైప్-C పోర్ట్‌తో వస్తుంది. ఫోన్ 5000mAh బ్యాటరీ, 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది.