NTV Telugu Site icon

Salaar :సలార్ ట్రైలర్ పై లేటెస్ట్ అప్డేట్.. వైరల్ అవుతున్న మిస్ నీల్ ఇంస్టాగ్రామ్ పోస్ట్..

Whatsapp Image 2023 11 19 At 2.59.58 Pm

Whatsapp Image 2023 11 19 At 2.59.58 Pm

కేజీఎఫ్‌ డైరెక్టర్‌ ప్రశాంత్‌ నీల్‌, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌ కాంబినేషన్‌లో వస్తున్న లేటెస్ట్ మూవీ సలార్.. ఈ చిత్రం రెండు పార్టులుగా తెరకెక్కుతుంది.. ఇప్పటికే విడుదల చేసిన సలార్ పార్ట్ -1 సీజ్ ఫైర్ టీజర్‌ నెట్టింట తెగ వైరల్ అవుతుంది.మిలియన్ల సంఖ్యలో వ్యూస్ రాబడుతూ ట్రెండింగ్ లో నిలిచింది.. ఇక ఈ సినిమా డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో సలార్‌ ట్రైలర్‌ను డిసెంబర్ 01 న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ ట్రైలర్ సంబంధించి తాజాగా ఒక అప్‌డేట్ వచ్చింది.ఈ ట్రైలర్‌పై ప్రశాంత్‌ నీల్‌ భార్య లిఖిత రెడ్డి నీల్ సోషల్ మీడియాలో సాలిడ్ అప్‌డేట్‌ ను అందించింది. సలార్ ట్రైలర్‌ కి సంబంధించిన పనులు శరవేగంగా జరుగుతున్నాయి అంటూ స్టూడియో నుంచి దింపిన ఫొటోను ఆమె తన ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది.

ఇక ముందు చెప్పినట్లుగానే సలార్ ట్రైలర్‌ను డిసెంబర్ 01 రాత్రి 7 గంటల 19 నిమిషాల కు విడుదల చేయనున్నట్లు తెలుస్తుంది.ఇక మాఫియా నేపథ్యం లో తెరకెక్కుతున్న ఈ మూవీ టీజర్‌లో డార్క్‌షేడ్స్‌ బ్యాక్ డ్రాప్ లో సలార్‌గా రెబల్‌ స్టార్ ప్రభాస్‌ ఎంట్రీ ఇస్తున్న సన్నివేశాలు ఇప్పటికే సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ప్రశాంత్‌ నీల్‌ ఈ సారి అంతర్జాతీయ మాఫియా చుట్టూ తిరిగే కథాంశంతో సలార్‌ను తెరకెక్కిస్తున్నాడని తెలుస్తుంది.. అంతేకాదు ఇందులో ఓ ఇంటర్నేషనల్‌ యాక్టర్‌ కూడా నటిస్తున్నాడని వార్తలు వస్తుండగా.. దీనిపై హోంబలే ఫిలిమ్స్ బ్యానర్‌ అండ్‌ మేకర్స్ టీం నుంచి క్లారిటీ రావాల్సి ఉంది.
సలార్‌లో మాలీవుడ్‌ స్టార్ హీరో పృథ్విరాజ్ సుకుమారన్‌ ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు. హోంబలే ఫిలిమ్స్ బ్యానర్‌పై విజయ్ కిరగందూర్ నిర్మిస్తున్న సలార్‌ పార్ట్‌-1 2023 డిసెంబర్ 22 న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళం, మలయాళం మరియు హిందీ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది.

Show comments