Salaar :సలార్ ట్రైలర్ పై లేటెస్ట్ అప్డేట్.. వైరల్ అవుతున్న మిస్ నీల్ ఇంస్టాగ్రామ్ పోస్ట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కాంబినేషన్‌లో వస్తున్న లేటెస్ట్ మూవీ సలార్.. ఈ చిత్రం రెండు పార్టులుగా తెరకెక్కుతుంది.. ఇప్పటికే విడుదల చేసిన సలార్ పార్ట్ -1 సీజ్ ఫైర్ టీజర్ నెట్టింట తెగ వైరల్ అవుతుంది.మిలియన్ల సంఖ్యలో వ్యూస్ రాబడుతూ ట్రెండింగ్ లో నిలిచింది.. ఇక ఈ సినిమా డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో సలార్ ట్రైలర్‌ను డిసెంబర్ 01 న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ ట్రైలర్ సంబంధించి తాజాగా ఒక అప్‌డేట్ వచ్చింది.ఈ ట్రైలర్‌పై ప్రశాంత్ నీల్ భార్య లిఖిత రెడ్డి నీల్ సోషల్ మీడియాలో సాలిడ్ అప్‌డేట్ ను అందించింది. సలార్ ట్రైలర్ కి సంబంధించిన పనులు శరవేగంగా జరుగుతున్నాయి అంటూ స్టూడియో నుంచి దింపిన ఫొటోను ఆమె తన ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది.
ఇక ముందు చెప్పినట్లుగానే సలార్ ట్రైలర్‌ను డిసెంబర్ 01 రాత్రి 7 గంటల 19 నిమిషాల కు విడుదల చేయనున్నట్లు తెలుస్తుంది.ఇక మాఫియా నేపథ్యం లో తెరకెక్కుతున్న ఈ మూవీ టీజర్‌లో డార్క్‌షేడ్స్ బ్యాక్ డ్రాప్ లో సలార్‌గా రెబల్ స్టార్ ప్రభాస్ ఎంట్రీ ఇస్తున్న సన్నివేశాలు ఇప్పటికే సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ప్రశాంత్ నీల్ ఈ సారి అంతర్జాతీయ మాఫియా చుట్టూ తిరిగే కథాంశంతో సలార్‌ను తెరకెక్కిస్తున్నాడని తెలుస్తుంది.. అంతేకాదు ఇందులో ఓ ఇంటర్నేషనల్ యాక్టర్ కూడా నటిస్తున్నాడని వార్తలు వస్తుండగా.. దీనిపై హోంబలే ఫిలిమ్స్ బ్యానర్ అండ్ మేకర్స్ టీం నుంచి క్లారిటీ రావాల్సి ఉంది.
సలార్‌లో మాలీవుడ్ స్టార్ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు. హోంబలే ఫిలిమ్స్ బ్యానర్‌పై విజయ్ కిరగందూర్ నిర్మిస్తున్న సలార్ పార్ట్-1 2023 డిసెంబర్ 22 న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళం, మలయాళం మరియు హిందీ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది.
Also Read
- Vaibhav Sooryavanshi: ‘నేను ఏం తప్పు చేశా..?’.. కోపంతో రగిలిపోతున్న వైభవ్ సూర్యవంశీ..
- Pakistan: "మక్కా ఒప్పందం అండగా లేదు".. సౌదీ-హౌతీ వార్‌లో పాకిస్తాన్ డ్యామెజ్ కంట్రోల్..
- Trump-Jinping: సెప్టెంబర్ 24న వైట్‌హౌస్‌లో ట్రంప్‌తో జిన్‌పింగ్ భేటీ.. కీలక అజెండా ఇదేనా?
- SKY: సూర్యకుమార్ యాదవ్ 36వ పుట్టినరోజు.. 'మిస్టర్ 360' అరుదైన రికార్డుల ప్రయాణం ఇలా..
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: ‘నేను ఏం తప్పు చేశా..?’.. కోపంతో రగిలిపోతున్న వైభవ్ సూర్యవంశీ..
-
Director Shouryuv: నెట్‌ఫ్లిక్స్ సమర్పణలో ‘హాయ్ నాన్న’ డైరెక్టర్ లార్జర్-దేన్-లైఫ్ ప్రాజెక్ట్! అసలు కథ ఇదే..
-
Pakistan: “మక్కా ఒప్పందం అండగా లేదు”.. సౌదీ-హౌతీ వార్‌లో పాకిస్తాన్ డ్యామెజ్ కంట్రోల్..
-
Trump-Jinping: సెప్టెంబర్ 24న వైట్‌హౌస్‌లో ట్రంప్‌తో జిన్‌పింగ్ భేటీ.. కీలక అజెండా ఇదేనా?
-
SKY: సూర్యకుమార్ యాదవ్ 36వ పుట్టినరోజు.. ‘మిస్టర్ 360’ అరుదైన రికార్డుల ప్రయాణం ఇలా..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!