NTV Telugu Site icon

Varun Tej : మరో ఫ్లాప్ డైరెక్టర్ ను లైన్లో పెట్టిన వరుణ్ తేజ్.. తేడా కొడితే ?

Matka (2)

Matka (2)

Varun Tej : మెగా కాంపౌండ్ నుంచి ఇండస్ట్రీలోకి వచ్చి వెరైటీ కథలతో సినిమాలు చేస్తున్నారు వరుణ్ తేజ్. హిట్ ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలను తెరకెక్కిస్తూ తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం వరుస డిజాస్టర్లు అందుకున్న హీరోల్లో వరుణ్ తేజ్ ఒకరు. ఇక ఇప్పుడు ఈ మెగా ప్రిన్స్ తన సక్సెస్ ట్రాక్‌ను ఎక్కేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ నెల 14న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న “మట్కా” చిత్రంతో మరలా హిట్ కొట్టాలన్న కసితో పనిచేస్తున్నారు. కరుణ కుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ గ్యాంగ్‌స్టర్ డ్రామా, వరుణ్‌ తేజ్ అభిమానులను ఎంటర్‌టైన్ చేయడంలో విజయం సాధిస్తుందని ఆ సినిమా నిర్మాతలు నమ్మకంగా ఉన్నారు. ఇటీవల రిలీజైన మూవీ ట్రైలర్‌కి మంచి స్పందన వచ్చింది. ఇందులోని మాస్ యాక్షన్‌ సీన్లు ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో పాటు వరుణ్ తేజ్ పాత్రలోని విభిన్న లుక్స్ సినిమాకు పాజిటివ్ హైప్‌ తెచ్చాయి. “లక్కీ భాస్కర్”తో ఇటీవల సాలీడ్ హిట్ అందుకున్న హీరోయిన్ మీనాక్షి చౌదరి ఇందులో నటిస్తుండగా, అదే సినిమాకు సంగీతం అందించిన జీవీ ప్రకాష్ కుమార్ కూడా మట్కా చిత్రానికి కూడా మ్యూజిక్ అందజేశారు. ఇక వరుణ్ తేజ్ మట్కా అనంతరం మరికొన్ని క్రేజీ కాంబినేషన్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

Read Also:Maharashtra Election: నేడు, రేపు మహారాష్ట్రలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచారం..

మట్కా తరువాత వరుణ్ తేజ్ ఎలాంటి ప్రాజెక్ట్ చేయబోతున్నాడన్న వార్త ఆసక్తిని కలుగజేస్తుంది. లేటెస్ట్ టాక్ ప్రకారం, మేర్లపాక గాంధీ చెప్పిన కథను వరుణ్ తేజ్ ఓకే చేసినట్లు టాక్. రాయలసీమ నేపథ్యంలో హారర్, కామెడీ అంశాలను మిళితం చేసిన ఈ వెరైటీ కథతో ప్రేక్షకులను అలరించేందుకు గాంధీ రెడీ అవుతున్నాడు. కెరీర్ ప్రారంభంలో “వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్”, “ఎక్స్‌ప్రెస్ రాజా” సినిమాలతో హిట్‌లు అందుకున్న గాంధీకి ఆ తర్వాత పెద్దగా విజయాలు దక్కలేదు. “కృష్ణార్జున యుద్ధం”, “మాస్ట్రో” వంటి సినిమాలు ఆశించిన స్థాయిలో విజయాన్ని సక్సెస్ కాకపోయినప్పటికీ అతనికి మంచి అవకాశాలు అందుతున్నట్లు తెలుస్తోంది. ఈసారి గాంధీ పక్కా హిట్ కోసం వరుణ్ తేజ్ కోసం కథ సిద్ధం చేశాడని టాక్. ఇదిలా ఉంటే, గద్దలకొండ గణేష్ వంటి మాస్ రోల్స్ తో మంచి క్రేజ్ తెచ్చుకున్న వరుణ్ తేజ్ ఆ తర్వాత విభిన్నమైన ప్రయోగాలు చేయడంతో మాస్ ఆడియన్స్ కొంత దూరమయ్యాడని చెప్పొచ్చు. అందుకే మట్కాతో మళ్ళీ ఆ రేంజ్ కిక్ ఇవ్వడానికి రెడీ అవుతున్నాడు.

Read Also:Trading leave letter: ఇదెక్కడి మాస్ లీవ్ లెటర్ రా మావా? రెండే ముక్కల్లో తేల్చేశాడు..

Show comments