NTV Telugu Site icon

Suriyas Kanguva : స్టార్ హీరో సూర్య కంగువా.. ట్రైలర్ బ్లాస్ట్ అయ్యేది ఎప్పుడో తెలుసా ?

New Project (98)

New Project (98)

Suriyas Kanguva : కోలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు స్టార్ హీరో సూర్య. పాన్ ఇండియా లెవల్లో విలక్షణ నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం కంగువా వంటి విభిన్న కథాంశంతో సూర్య ప్రేక్షకులను పలకరించేందుకు రెడీ అయిపోయాడు. అక్టోబర్ 10, 2024 న వరల్డ్ వైడ్ గా థియేటర్లలో రిలీజ్ కి రెడీ అయిన ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటుంది. ఇప్పటికే వచ్చిన అప్ డేట్స్ అన్నీ సినిమా పై అంచనాలను పెంచేశాయి. బాలీవుడ్ నటి దిశా పాటని హీరోయిన్ గా నటిస్తుంది. దర్శకుడు శివ ఈ చిత్రాని భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇది ఒక్క సూర్య కెరీర్ లోనే కాకుండా టోటల్ తమిళ సినిమా నుంచి కూడా ఒక బిగ్గెస్ట్ బడ్జెట్ సినిమాగా రాబోతుంది. అయితే ఈ సినిమాని కూడా మేకర్స్ రెండు భాగాలుగా ప్లాన్ చేస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి ఒక స్పెషల్ అప్డేట్ ని మేకర్స్ అందించారు.

Read Also:PM Modi: వయనాడులో ప్రధాని ఏరియల్ సర్వే.. రాహుల్ గాంధీ ట్వీట్

దీనితో ఈ సినిమా ట్రైలర్ ని ఏకంగా రెండు నెలల ముందే విడుదల చేస్తున్నట్లు అధికారికంగా సాలిడ్ అప్డేట్ అందించారు. జనరల్ గా ఏ భారీ సినిమా అయినా ఇప్పుడు ట్రెండ్ లో సరిగ్గా ఒక్క నెల ముందు ట్రైలర్ ని రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. కానీ ఈ సినిమా మేకర్స్ మాత్రం రెండు నెలల ముందే ట్రైలర్ రిలీజ్ చేయడం విశేషం. ఇక ఈ చిత్రం అక్టోబర్ 10న థియేటర్స్ లోకి రానుండగా దీనికి రెండు నెలల ముందే ఈ ఆగస్ట్ 12న ట్రైలర్ రిలీజ్ చేస్తున్నట్టుగా సూర్యపై ఒక పవర్ఫుల్ పోస్టర్ తో అధికారికంగా ప్రకటించారు. ఇది మాత్రం క్రేజీ లెవెల్లో ఉందని చెప్పాలి. సూర్య తన సాలిడ్ మేకోవర్ లో కనిపిస్తుండగా తన వెనుక ఉన్న రెండు రెక్కలతో యూనిక్ గా డిజైన్ చేశారు. ఇక ఈ చిత్రానికి మ్యూజిక్ సెన్సేషన్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించగా స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ వారు నిర్మాణం చేపట్టారు.

Read Also:Malla Reddy University: మల్లారెడ్డి అగ్రికల్చర్ యూనివర్సిటీ వద్ద ఉద్రిక్తత..

Show comments