Site icon NTV Telugu

Railway Jobs 2024 : రైల్వేలో భారీగా ఉద్యోగాలు.. ఎలా అప్లై చేసుకోవాలంటే?

Railway Jobs

Railway Jobs

రైల్వేలో ఉద్యోగం చెయ్యాలని అనుకుంటున్నారా? అయితే మీకో అదిరిపోయే గుడ్ న్యూస్.. తాజాగా రైల్వే శాఖ భారీగా ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేసింది.. ఈ నోటిఫికేషన్ ప్రకారం 733 ఉద్యోగాలను భర్తీ చెయ్యనున్నారు..రైల్వేలో 733 అప్రెంటిస్​పోస్టుల భర్తీకి సౌత్​ ఈస్ట్ సెంట్రల్​ రైల్వే నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతలు, ఎలా అప్లై చేసుకోవాలో ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం..

మొత్తం పోస్టుల సంఖ్య.. 733

పోస్టుల వివరాలు..

ఫిట్టర్​ పోస్టులు 187,
ఎలక్ట్రీషియన్​ పోస్టులు 137,
కోపా పోస్టులు 100,
వైర్​మెన్ పోస్టులు 80,
పెయింటర్​ పోస్టులు 42,
కార్పెంటర్ పోస్టులు 38.
వీటితో పాటు డ్రాఫ్ట్​మెన్​ (సివిల్​) – 10,
ఎలక్ట్రో మెకానిక్​ – 5,
మెషినిస్ట్ – 4,
ప్లంబర్​ – 25, మెకానిక్​ – 15,
ఎస్​ఎండబ్ల్యూ – 4,
స్టెనో (ఇంగ్లీష్​) – 27,
స్టెనో (హిందీ) – 19,
డీజిల్ మెకానిక్​ – 12,
టర్నర్​ – 4,
వెల్డర్​ – 18,
కెమికల్ లేబరేటరీ అసిస్టెంట్​ – 4,
డిజిటల్ ఫొటోగ్రాఫర్​ – 2 పోస్టులు

అర్హతలు..

ఒక్కో పోస్టులకు ఒక్కో విద్యార్హతలు ఉన్నాయి.. గుర్తింపు పొందిన యూనివర్సిటీలో డిగ్రీని పొంది ఉండాలి..

వయసు..

ఉద్యోగాలకు అప్లై చేయాలంటే అభ్యర్థుల వయసు 15 నుంచి 24 ఏళ్ల మధ్యలో ఉండాలి.. ఇక ఈ పోస్టులకు అప్లై చేసుకొనేవాళ్లు ఎటువంటి ఫీజును చెల్లించాల్సిన పని లేదు..

ఇకపోతే ఈ పోస్టులకు సెలెక్ట్ అయినవాళ్లకు ఒక ఏడాది పాటు అప్రెంటీస్​షిప్​ ట్రైనింగ్ ఇస్తారు.. ఆ తర్వాత పోస్టింగ్ ఇస్తారని తెలుస్తుంది.. ఈ పోస్టుల పై ఆసక్తి కలిగిన అభ్యర్థులు https://www.apprentice shipindia.gov.in ద్వారా అప్లికేషన్ ఫామ్‌ను సమర్పించాలి. ఈ పోస్టులకు ఏప్రిల్ 12 లోగా అప్లై చేసుకోవాలి..

Exit mobile version