Site icon NTV Telugu

Gold Rates: శుభవార్త.. మళ్లీ తగ్గిన బంగారం ధరలు.. 10 గ్రాముల ధర ఎంతంటే..

Goldrates

Goldrates

బంగారం ధరల్లో ఊహించని మార్పులు చోటు చేసుకున్నాయి. యుద్ద ప్రభావం కారణంగా మరోసారి బంగారం ధరలు తగ్గాయి. బంగారం కొనే వారికి ఇది నిజంగా శుభవార్త అనే చెప్పాలి. ప్రస్తుతం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ఉదయం రూ.770, సాయంత్రం రూ.980 తగ్గి రూ.1,61,130 వరకు దిగి వచ్చింది. అలానే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ఉదయం రూ.770, సాయంత్రం రూ.900 తగ్గి.. ప్రస్తుతం రూ.1,47,400గా నమోదైంది. అయితే వెండి ధరల్లో ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు. కిలో వెండి ధర ప్రస్తుతం రూ.2,90,000 పలుకుతోంది.

బంగారం ధరలు తగ్గడానికి ప్రధానంగా అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులు, ఆర్థిక అంశాలు, పెట్టుబడిదారుల ప్రవర్తన కారణమవుతాయి. ప్రస్తుతం ఉన్న మార్కెట్ విశ్లేషణల ప్రకారం.. బంగారం ధరలు తగ్గడానికి ప్రధాన కారణాల్లో ముఖ్యంగా.. అమెరికన్ డాలర్ బలం. బంగారం అంతర్జాతీయంగా అమెరికన్ డాలర్లలోనే ట్రేడ్ అవుతుంది. డాలర్ విలువ పెరిగినప్పుడు.. ఇతర కరెన్సీలు కలిగిన దేశాలకు బంగారం కొనడం ఖరీదైనదిగా మారుతుంది. దీనివల్ల అంతర్జాతీయంగా డిమాండ్ తగ్గి, ధరలు పడిపోతాయి.

Also Read: Gold Rates: శుభవార్త.. మళ్లీ తగ్గిన బంగారం ధరలు.. 10 గ్రాముల ధర ఎంతంటే..

బంగారం అనేది ఎటువంటి ఆదాయాన్ని (వడ్డీని) ఇవ్వని పెట్టుబడి. బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్లు లేదా బాండ్ల ద్వారా మంచి వడ్డీ లభిస్తున్నప్పుడు.. పెట్టుబడిదారులు బంగారం కంటే వాటివైపే మొగ్గు చూపుతారు. అమెరికా కేంద్ర బ్యాంక్ (US Federal Reserve) వడ్డీ రేట్ల విషయంలో తీసుకునే నిర్ణయాలు, అంచనాలు బంగారం ధరపై తీవ్ర ప్రభావం చూపుతాయి.

అన్నింటి కంటే ప్రధాన కారణం.. అంతర్జాతీయ పరిస్థితులు. సాధారణంగా యుద్ధాలు లేదా అనిశ్చితి ఉన్నప్పుడు బంగారం ధరలు పెరుగుతాయి. అయితే.. కొన్నిసార్లు మార్కెట్‌లో పరిస్థితి కొంత కుదుటపడిందని పెట్టుబడిదారులు భావించినప్పుడు లేదా భయం తగ్గితే, వారు బంగారం నుంచి తమ పెట్టుబడులను తీసివేసి స్టాక్ మార్కెట్ వంటి ఇతర లాభదాయక రంగాల వైపు మళ్లిస్తారు. దీనివల్ల బంగారంపై డిమాండ్ తగ్గి ధరలు తగ్గుతాయి. చాలా మంది స్వల్పకాలిక ట్రేడర్లు మార్కెట్ అంచనాల ఆధారంగా బంగారాన్ని కొంటూ.. అమ్ముతూ ఉంటారు. మార్కెట్ సెంటిమెంట్ మారినప్పుడు లేదా ప్రైస్ లెవల్స్ బ్రేక్ అవ్వనప్పుడు భారీగా అమ్మకాలు జరిగి ధరలు హఠాత్తుగా తగ్గుతుంటాయి.

Exit mobile version