విశాఖ రైల్వే జోన్కు ఏపీ ప్రభుత్వం సరికొత్తగా భూమి కేటాయించనుంది. ఈ క్రమంలో.. వైజాగ్ రైల్వే జోన్ ఏర్పాటు పై పురోగతి ఉంది.. సీఎంతో మాట్లాడానని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. ఎప్పటికప్పుడు సహచర కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. గతంలో విశాఖ రైల్వే జోన్ కార్యాలయం నిర్మాణానికి కేటాయించిన స్థలం నీరు నిలిచే ప్రాంతం అని. కొత్తగా వేరే భూమిని ఏపీ ప్రభుత్వం కేటాయించాలని అశ్వినీ వైష్ణవ్ తెలిపారు.
Read Also: Jammu Kashmir: అనంత్‌నాగ్ ఎన్‌కౌంటర్.. ఉగ్రవాదుల కాల్పల్లో ఇద్దరు జవాన్లకు గాయాలు..
కాగా.. కేంద్ర ప్రభుత్వం వివిధ రాష్ట్రాల్లో ఎనిమిది కొత్త రైల్వే లైన్ ప్రాజెక్టులకు ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే.. రూ. 24,657 కోట్ల అంచనా వ్యయంతో, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, జార్ఖండ్, బీహార్, పశ్చిమ బెంగాల్‌లలో ఈ కొత్త రైల్వే లైన్లను ఏర్పాటు చేయనున్నారు. ఇందులో భాగంగా ఒడిశాలోని మల్కన్‌గిరి నుండి భద్రాచలంలోని పాండురంగాపురం వరకు రూ. 4,109 కోట్లతో 200.60 కి.మీ పొడవున కొత్త లైన్‌ను నిర్మించనున్నారు. ఈ లైన్ పూర్తి చేసి అందుబాటులోకి వస్తే ఏపీ, తెలంగాణ నుంచి తూర్పు, ఈశాన్య రాష్ట్రాలకు రైల్వే కనెక్టివిటీ పెరుగుతుందని కేంద్రం స్పష్టం చేసింది. ఈ ప్రాజెక్టు వల్ల చాలా రాష్ట్రాలు లబ్ది పొందుతాయని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు.
Read Also: Rahul Gandhi: ప్రధాని మోడీకి థాంక్స్ చెప్పిన రాహుల్ గాంధీ..ఎందుకంటే..?