Site icon NTV Telugu

IND vs AUS : మూడో వన్డేకు భారత జట్టులో కీలక మార్పులు.. సూర్యకు లాస్ట్ ఛాన్స్

Ind Vs Aus 3rd Odi

Ind Vs Aus 3rd Odi

విశాఖపట్నం వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలో భారత్ ఘరో పరాభావం చవి చూసింది. ఇప్పుడు కీలకమైన మూడో వన్డేకు సిద్దమైంది. బుధవారం చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా ఆఖరి వన్డేలో భారత్-ఆసీస్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ లో ఏలాగైనా విజయం సాధించి సిరీస్ ను సొంతం చేసుకోవాలని ఇరు జట్లు భావిస్తున్నాయి.
ఇక సిరీస్ డిసైడ్ చేసే మూడో వన్డేలో టీమిండియా ఒక మార్పుతో బరిలోకి దిగే అవకాశం ఉంది. వెటరన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ స్థానంలో ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్ కు అవశాకం ఇవ్వాలని జట్టు మెనెజ్మెంట్ భావిస్తున్నట్లు సమాచారం. కాగా ఈ సిరీస్ లో తొలి రెండు మ్యాచ్ లకు బెంచ్ కే పరిమితమైన సుందర్ ను, తన హోంగ్రౌండ్ చెపాక్ లో ఖచ్చితంగా ఆడించాలని రోహిత్ శర్మ భావిస్తున్నారని టాక్.

Also Read : Budget : అదానీ వ్యవహారంపై విపక్షాల ఆందోళన.. మధ్యాహ్నం 2 గంటలకు లోక్ సభ వాయిదా

అదే విధంగా తొలి రెండు వన్డేల్లో గోల్డన్ డక్ గా వెనుదిరిగిన స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ కు మరో అవకాశం ఇవ్వాలని జట్టు మెనెజ్మెంట్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఆస్ట్రేలియా విషయానికి వస్తే.. రెండో వన్డేలో బరిలోకి దిగిన జట్టును మూడో వన్డేకు కొనసాగించాలని ఆసీస్ మెనెజ్మెంట్ భావిస్తున్నట్లు సమాచారం అందుతుంది. చెపాక్ పిచ్ స్పన్నర్లకు స్వర్గదామం వంటింది. స్పన్నర్లకు అనుకూలమైన ఈ పిచ్ లో పరుగులు తియ్యడం చాలా కష్టంగా ఉంది. ఇక్కడ పిచ్ రెండవ ఇన్సింగ్స్ లో చాలా నెమ్మదిగా ఉంటుంది. రాత్రి మ్యాచ్ లో మంచు ముఖ్యమైన అంశం. కాబట్టి టాస్ గెలిచిన జట్టు మొదటి బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకోవచ్చు.

Also Read : MLC Kavitha: ఈడీకి ఎమ్మెల్సీ కవిత లేఖ.. ఆ.. విషయంపై ప్రశ్నల వర్షం

Exit mobile version