NTV Telugu Site icon

Lasith Malinga As Singer: సంగీత ప్రపంచంలోకి అడుగెట్టిన లసిత్ మలింగ.. పాటతో అదరగొట్టాడుగా

Malinga

Malinga

Lasith Malinga As Singer: శ్రీలంక క్రికెట్ దిగ్గజం లసిత్ మలింగ, తన డెడ్ యార్కర్లతో ప్రపంచ క్రికెట్‌లో ప్రత్యేకమైన గుర్తింపు పొందాడు. కానీ, ఇప్పుడు అతను క్రికెట్‌ను వీడి కొత్తగా సంగీత ప్రపంచంలోకి అడుగుపెట్టాడు. ఇందుకు సంబంధించి, తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసిన ఒక వీడియోలో మలింగ శ్రీలంక సాంప్రదాయ సంగీతాన్ని పాడుతూ చేసేవారిని మంత్ర ముగ్ధుల్ని చేసాడు. ఇక ఈ వీడియో క్షణాల్లోనే వైరల్ కావడంతో.. ఆయన అభిమానులు అభిమాన క్రికెటర్‌లోని కొత్త కోణాన్ని చూసి పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.

Also Read: Jio 601 Recharge Plan: ఏడాది పాటు 5G డేటా అన్‌లిమిటెడ్ ప్లాన్‌ను విడుదల చేసిన జియో..

మలింగ క్రికెట్‌లో తన ప్రత్యేకమైన బౌలింగ్ శైలితో మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇప్పుడు సంగీతంలో కూడా అదే స్థాయిలో గుర్తింపు పొందాలని అతను భావిస్తున్నాడు. ఇందులో భాగంగానే అతని మధురమైన వోకల్స్, సంగీతం పట్ల ఉన్న అమితమైన ప్రేమ, ఇంకా శ్రీలంక సంస్కృతిపై ఉన్న అనుబంధం అతని పాటలలో ప్రతిబింబిస్తుంది. ఇక సోషల్ మీడియాలో ఆయన టాలెంట్‌ను చూసి పొగుడుతూ కామెంట్ల రూపంలో వారి అభిమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. సంగీతంలో మలింగ చేసిన ఈ ప్రయాణం అతని బహుముఖ ప్రజ్ఞను చూపిస్తుంది. కేవలం క్రికెట్‌నే కాదు, ఆయన తన జీవితాన్ని కొత్త కోణాల్లో అన్వేషించడానికి కూడా కృషి చేస్తున్నాడు. మలింగ ఈ మార్గం ద్వారా క్రీడల తర్వాత జీవితంలో కూడా అనేక అవకాశాలు ఉన్నాయని నిరూపించాడు. మలింగ అభిమానుల దృష్టిలో క్రికెటర్‌గా మాత్రమే కాకుండా, ఇప్పుడు సంగీత ప్రియుడిగా కూడా గుర్తింపు పొందినందుకు, అతని కొత్త ప్రయాణం మరింత ఆసక్తికరంగా మారింది. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ వైరల్ వీడియోను చూసి మీకేమనిపించిందో ఓ కామెంట్ రూపంలో తెలపండి.

Show comments