Site icon NTV Telugu

Lashkar-e-Taiba: ఢిల్లీపై దాడులు చేస్తాం, భారత్‌ను ముక్కలు చేస్తాం.. లష్కరే ఉగ్రవాది హెచ్చరిక..

Hafeez Saeed

Hafeez Saeed

Lashkar-e-Taiba: ఆపరేషన్ సిందూర్ ద్వారా బుద్ధి చెప్పినా, పాకిస్తాన్ ఉగ్రవాదులు మారడం లేదు. భారత్ చేసిన దాడుల్లో లష్కరే తోయిబా మురిడ్కే హెడ్‌క్వార్టర్, బహవల్పూర్‌లోని జైషే మహ్మద్ ముఖ్య కార్యాలయాలు తీవ్రంగా ధ్వంసమయ్యాయి. అయినా కూడా వారు తమ భారత వ్యతిరేకతను వీడటం లేదు. టైమ్ కుదిరితే భారత్‌పై విధ్వంసానికి దిగుతామని వార్నింగ్ ఇస్తున్నారు. అఖండ భారత్‌ను ముక్కలు చేస్తాం, ఢిల్లీని వణికిస్తాం, ఆగ్రాని అగ్నికి ఆహుతి చేస్తాం, దక్కన్ ప్రాంతాన్ని తగలబెడుతాం, కాశ్మీర్‌ను విముక్తి చేస్తామంటూ ప్రగల్భాలు పలికాడు.

Read Also: Islamabad blast: పాక్‌లో ఎమర్జెన్సీ.. ఇస్లామాబాద్‌ భారీ పేలుడు.. 15 మందికి పైగా మృతి..

తాజాగా లష్కర్-ఏ-తయిబా (LeT) సీనియర్ కమాండర్ సయీద్ అబ్దుల్ రెహ్మాన్ నక్వీ, లాహోర్‌లో జరిగిన పబ్లిక్ మీటింగ్‌లో మాట్లాడుతూ.. ఢిల్లీ, ఆగ్రా వంటి నగరాలపై దాడులు చేస్తామని హెచ్చరించారు. ‘‘కాశ్మీర్ సాలిడారిటీ డే’’ సందర్భంగా పాక్ ఉగ్రవాదులు అనేక కార్యక్రమాలు నిర్వహించి భారత్‌పై విషం కక్కారు. భారతదేశాన్ని ముక్కలుగా చేస్తామని, కాశ్మీర్‌కు విముక్తి చేస్తామని అన్నారు. లష్కరే తోయిబా రాజకీయ పార్టీగా ఉన్న పాకిస్తాన్ మర్కజీ ముస్లిం లీగ్ పార్టీకి నాయకత్వం వహిస్తున్న నక్వీ, తన పార్టీని ఉగ్రవాదంతో అనుసంధానించాడు. లష్కరే చీఫ్ హఫీజ్ సయీద్, ఆయన కుమారుడు తల్హా సయీద్‌లకు నక్వీ అత్యంత సన్నిహితుడిగా పేరుంది.

Exit mobile version