NTV Telugu Site icon

Viral Video: జడ్జిపై దాడి చేసిన నిందితుడు.. వీడియో వైరల్

Judge

Judge

న్యాయస్థానాల్లో తీర్పులు తమకు అనుకూలంగా రావాలని అందరు అనుకుంటారు. కానీ, ఆ తీర్పు వ్యతిరేకంగా వస్తే హైకోర్టుకుల వెళ్తారు.. అయితే, అమెరికాలోని లాస్ వెగాస్ లో ఇందుకు భిన్నంగా ఓ షాకింగ్ వీడియో బయటకు వచ్చింది. ఓ మహిళ జడ్జి తీర్పు చదివి వినిపిస్తున్న సమయంలో నిందితుడు సహనం కోల్పోయి.. పరుగు పరుగున వచ్చి న్యాయమూర్తి( జడ్జి ) పై దూకి దాడి చేసేందుకు ప్రయత్నించాడు.

Read Also: S Jaishankar: “నెహ్రూ దేశ ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇస్తే ఈ పరిస్థితి ఉండేది కాదు”.. చైనా సంబంధాలపై జైశంకర్..

అయితే, డెయోబ్రా రెడ్డెన్ అనే వ్యక్తి లాస్ వెగాస్‌లోని కోర్టులో శిక్షా నిర్ణయ విచారణ కోసం వచ్చాడు. బ్యాటరీలు దొంగతనం చేసిన కేసులో కోర్టులో హాజరై నేరాన్ని అంగీకరించాడు నిందితుడు.. ఈ సందర్భంగా జడ్జ్ అతడికి శిక్షను విధిస్తున్న సమయంలో కోపంతో ఒక్కసారిగా అక్కడ ఉన్న న్యాయమూర్తిపై దాడి చేసేందుకు ప్రయత్నించాడు. దీంతో ఒక్కసారిగా న్యాయమూర్తి కిందకి పడిపోయింది.. ఇక, ఆమెకు గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. అక్కడే ఉన్న పోలీసులు అప్రమతమై వెంటనే నిందితుడిని అదుపులోకి తీసుకుని బంధించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.