Lanka Dinakar: సిట్ తో పేదల బియ్యం మాఫియా ఆగడాల ఆటకట్టు అన్నారు ఇరవై సూత్రాల కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్.. మీడియాతో మాట్లాడిన ఆయన.. కాకినాడ పోర్టులో కూలీలకు పని కల్పించడం అంటే అక్రమ అవినీతి బియ్యం వ్యాపారంతో కాదు.. సక్రమమైన ఎగుమతులు – దిగుమతుల వ్యాపారంతో అనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని హితవుచెప్పారు.. కరోనా సమయంలో కేంద్ర ప్రభుత్వం పేదలకు ఆకలి తీర్చాలని రెట్టింపు బియ్యం ఇస్తే, కాకినాడ పోర్టు నుండి రెట్టింపు బియ్యం విదేశాలకు వెళ్లిందని విమర్శించారు.. పేదల బియ్యం దోపిడీ పైన “సిట్“ అనగానే కలుగులో ఉన్న అవినీతిపరులు స్టాండ్, అటెన్షన్ అండ్ రన్.. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బియ్యం ఎగుమతి చేస్తున్న నౌకను ఆపడం వెనక ఉన్న స్ఫూర్తి ముఖ్యం అన్నారు.
Read Also: Delhi Assembly polls: ఆప్ రెండో జాబితా విడుదల.. సిసోడియా స్థానం త్యాగం!
ఇక, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పేదలకు ఉచిత బియ్యం కోసం సంవత్సరానికి సగటున ఇస్తున్న 16 వేల కోట్లు దుర్వినియోగం కావడం బాధాకరం.. ప్రస్తుతం దాదాపు 10 వేల కోట్లు కేంద్రానికి, 6 వేల కోట్లు రాష్ట్రానికి ఉచిత బియ్యం కోసం ఖర్చు చేస్తున్నాయి.. గడచిన 5 సంవత్సరాలలో రమారమి మొత్తం 80 వేల కోట్లు ఖర్చు చేశారని లెక్కలు చెప్పుకొచ్చారు లంకా దినకర్.. పేదలకు పట్టెడు అన్నం పెట్టడానికి అన్న ఎన్టీఆర్ 2/- కిలో బియ్యం పథకం ప్రారంభించారు.. పేద ప్రజలకు ఉచిత బియ్యం పంపిణీ చెయ్యాలనే ఉద్దేశ్యంతో ప్రధాని మోడీ.. గరీబ్ కల్యాణ్ అన్న యోజన ప్రారంభించారని గుర్తుచేశరాఉ. 10 అక్టోబర్ 2024న సివిల్ సప్లై కార్పొరేషన్ అధికారులను ప్రభుత్వ ఉచిత బియ్యం సమీక్ష కోసం సమాచారాన్ని అడిగాం.. 15 అక్టోబర్ 2024 న సివిల్ సప్లై అధికారులతో చర్చించినప్పుడు అనేక సమస్యలు ప్రస్తావనకు వచ్చాయి.. ఇప్పటివరకు అధికారుల నుండి లభించిన సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయని చెప్పుకొచ్చారు.
* 2019 – 24 మధ్య రాష్ట్ర ప్రభుత్వం చేసిన వ్యయం దాదాపు రూ. 30,000 కోట్లు : 59,08,146 రేషన్ కార్డులకు గాను 1,63,51,364 మంది లబ్ధిదారులు.
* 2019 – 24 మధ్య కేంద్ర ప్రభుత్వం దాదావు చేసిన వ్యయం రూ. 49,200 కోట్లు : 89,35,525 కార్డులకు గాను 2,68,30,006 మంది లబ్ధిదారులు.
* మొత్తం రేషన్ కార్డులు : 1,48,43,671 అయితే లబ్ధిదారుల సంఖ్య 4,31,81,370 – మొత్తం వ్యయం రూ. 79,200 కోట్లు
* 2019 – 24 మధ్య సివిల్ సప్లై కార్పొరేషన్ చేసిన అదనపు అప్పులు : 20,931 కోట్లు.
Read ALso: R. Krishnaiah: మరోసారి రాజ్యసభకు ఆర్.కృష్ణయ్య.. ఈ సారి బీజేపీ నుంచి..
అయితే, కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ, ఎఫ్సీఐ నుండి వచ్చే ఆదాయం, రాష్ట్ర బడ్జెట్ ఆదాయం మళ్లింపు ద్వారా సివిల్ సప్లైస్ రుణాలపైన వడ్డీలు, అసలు వాయిదాలు కడుతున్నారు. పూర్తి స్థాయి అధ్యయనం అనంతరం అర్హులైన పేదలకు బియ్యం పంపిణీ అందేవిధంగా సంస్కరణల పైన నివేదిక ఇవ్వడం జరుగుతుంది. సిట్ నివేదిక అందిన అనంతరం పేదల బియ్యం రీసైకిల్ చేసి మింగిన వారిపైన రాష్ట్ర ప్రభుత్వం చట్టపరంగా చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు ఇరవై సూత్రాల కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్.
