Site icon NTV Telugu

Lanka Dinakar : పవర్ ప్రాజెక్టుల ద్వారా అంతులేనంత పైసలు – భూముల దోపిడీ

Lanka Dinakar

Lanka Dinakar

పవర్ ప్రాజెక్టుల ద్వారా అంతులేనంత పైసలు – భూములు దోపిడీ జరుగుతుందని ఏపీ బీజేపీ ముఖ్య అధికారప్రతినిధి లంకా దినకర్ అన్నారు. ఇవాళ ఆయన విజయవాడలో మాట్లాడుతూ.. యాక్సిస్ ఎనర్జీ వెంచర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ తో అపరిమిత “యాక్సిస్”, ఇండోసోల్ ఆయన “సోల్” అని ఆయన అన్నారు. యాక్సిస్ ఎనర్జీ వెంచర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ 774.90 మెగావాట్ల పీపీఏ ప్రతిపాదనలను ఈఆర్సీ తిరస్కరించడాన్ని ఆహ్వానిస్తున్నామని, 774.90 మెగావాట్ల పీపీఏ రద్దు చేసినందున రాష్ట్రానికి 7300 కోట్లు నష్ట నివారణ జరిగిందని ఈఆర్సీ పేర్కొందన్నారు.

 

మొత్తం 4 వేల మెగావాట్ల ప్రాజెక్టులు రద్దు చేస్తే, రాష్ట్రానికి 40,000 కోట్లు నష్ట నివారణ తధ్యమని, 1672.80 మెగావాట్ల ప్రాజెక్టులను రద్దు చేయమని యాక్సిస్ ఎనర్జీ వెంచర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ లిఖిత పూర్వకంగా కోరాయి కదా? అది నిజమా కాదా? అని ఆయన ప్రశ్నించారు. ఆగమేఘాల మీద ఎన్నికల ముందు తేదీ 6 ఫిబ్రవరి 2024న ఇచ్చిన జీఓ నెం 19 అనేక అనుమానాలకు తావిస్తుందని, నంద్యాల, కర్నూల్ , అనంతపురం, కడప జిల్లాల్లో అటవీ, రెవిన్యూ, ప్రైవేట్ భూములు అన్యాక్రాంతానికి చీకటి జీఓ19 ఇచ్చారన్నారు దినకర్‌. యాక్సిస్ కు 30వేల‌ ఎకరాలు ధారాదత్తం చేసేందుకు సిద్ధం చేసారని ఆయన పేర్కొన్నారు.

 

Exit mobile version