Site icon NTV Telugu

Floods in Sikkim: సిక్కింలో భారీ వర్షం.. చిక్కుకుపోయిన పర్యాటకులు..

Sikkim

Sikkim

Floods in Sikkim: ఈశాన్య రాష్ట్రమైన సిక్కింలో వర్ష బీభత్సం కొనసాగుతుంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు పర్యాటకులు పలు ప్రాంతాల్లో స్ట్రక్ అయిపోయారు. బుధవారం రాత్రి ఉత్తర సిక్కింలో 220 మి.మీకు పైగా వర్షం కురిసింది. దీంతో తీస్తాలో పెద్ద ఎత్తున వరదలు వచ్చాయి. ఈ వరదల ప్రభావిత ప్రాంతాల్లో 1,200 మందికి పైగా స్వదేశీ, విదేశీ పర్యాటకులు చిక్కుకుపోయారు. పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడటంతో ఇళ్లలోకి భారీగా నీరు చేరింది.

Read Also: Congress : పలు రాష్ట్రాల్లో అధ్యక్షులను మార్చేందుకు కాంగ్రెస్ ప్లాన్

ఇక, వాతావరణం అనుకూలించిన తర్వాత పర్యాటకులను ఇక్కడి నుంచి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తామని అధికారులు తెలిపారు. రోడ్డు మరమ్మతులకు ఐదు నుంచి ఆరు రోజులు పట్టొచ్చని పేర్కొన్నారు. ఉత్తర సిక్కింలో శుక్రవారం కూడా భారీ వర్షం పడింది. ఈ విపత్తు బారిన పడి మృతి చెందినవారి సంఖ్య 6కి చేరుకుంది. గురువారం ముగ్గురి మృతదేహాలు దొరికాయి. మరో ముగ్గురు తప్పిపోయారు.

Read Also: Harish Shankar : తీవ్ర మెడ నొప్పితో రవితేజ షూటింగ్.. హరీష్ శంకర్ పోస్ట్ వైరల్..

కాగా, సిక్కింలోని సంక్లాంగ్ ప్రాంతంలో వంతెన కొట్టుకుపోవడంతో చుంగ్తాంగ్, లాచుంగ్ ప్రాంతాల నుంచి పూర్తిగా రాకపోకలు నిలిచిపోయాయి. ఈ విపత్తు పరిస్థితిని సమీక్షించేందుకు సీఎం ప్రేమ్ సింగ్ తమాంగ్ అధికారులతో ప్రత్యేక భేటీని ఏర్పాటు చేశారు. బాధిత ప్రాంతాలకు సంబంధించిన పరిస్థితులపై వివరాలు సేకరించారు. సహాయక చర్యలు వేగవంతం చేయాలన్నారు. రాష్ట్రంలో చిక్కుకుపోయిన పర్యాటకులను ప్రత్యేక విమానంలో తరలించేందుకు కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నట్లు సిక్కిం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయ్ భూషణ్ పాఠక్ వెల్లడించారు.

Exit mobile version