Site icon NTV Telugu

Landslides: అరుణాచల్ ప్రదేశ్‌లో విరిగిపడుతున్న కొండచరియలు.. రవాణా బంద్

Landslides

Landslides

అరుణాచల్ ప్రదేశ్‌లో గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలు, కొండచరియలు విరిగిపడటంతో పలు జిల్లాల్లో రవాణా సౌకర్యం నిలిచిపోయింది. ఇదిలా ఉండగా శనివారం సిజి వద్ద అకాజన్-లికాబాలి-ఆలో రహదారిపై కొండచరియలు విరిగిపడినట్లు ఓ అధికారి తెలిపారు. అయితే తరచూ కొండచరియలు విరిగిపడుతుండటంతో భారీ వాహనాలను అనుమతించడం లేదని, దీంతో గత కొన్ని రోజులుగా రోడ్డుకు ఇరువైపులా భారీ వాహనాలు నిలిచిపోయాయని తెలిపారు. చిన్న వాహనాలకు మాత్రమే అనమతి ఉందని అధికారులు పేర్కొన్నారు.

Read Also: AP Panchayat Bypoll Results: పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ హవా..

మరోవైపు అరుణాచల్ ప్రదేశ్‌లోని లేపా రాడా, పశ్చిమ సియాంగ్, ఎగువ సియాంగ్, సియాంగ్, ఎగువ సుబంసిరి మరియు షి యోమి జిల్లాలలో భారీగా కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో అధికారులు.. ఈ రహదారులను మూడు రోజులు పాటు మూసివేయాలని తెలిపారు. అనంతరం రోడ్లపై మరమ్మత్తు పనులూ పూర్తి చేస్తామన్నారు.

Read Also: Rashmi Gautam: బాయ్ ఫ్రెండ్ గురించి రష్మీ హాట్ కామెంట్స్.. గ్యాప్ వచ్చేస్తుందట!

ఇదిలా ఉంటే.. ఈశాన్య రాష్ట్రాల్లో రానున్న ఐదు రోజుల పాటు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ (ఐఎండీ) శుక్రవారం హెచ్చరికలు జారీ చేసింది. దీంతో పాటు ఢిల్లీ ఎన్‌సీఆర్‌లో ఆగస్టు 29 వరకు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.

Exit mobile version