Site icon NTV Telugu

Lalitha Jewellery In Chandanagar: చందానగర్ లో లలితా జ్యూవెలరీ షోరూం ప్రారంభం

lalitha jewels

C9e798d7 Ce00 4c39 B885 D1a0c901bd22

తక్కువ ధరలకే నాణ్యమయిన బంగారు ఆభరణాలు అందిస్తున్న లలితా జ్యూవెలరీ హైదరాబాద్ లో తన 4వ షోరూంని చందానగర్ లో సెప్టెంబర్ 9 వ తేదీ, శుక్రవారం అట్టహాసంగా ప్రారంభించింది. గత 38 సంవత్సరాలుగా సేవలందిస్తూ దక్షిణ భారతదేశంలో అగ్రగామిగా గుర్తింపు తెచ్చుకున్న లలితా జ్యూవెలరీ ఇప్పుడు 44వ షోరూంని చందానగర్ లో ప్రారంభించడం ఆనందంగా వుందని మేనేజింగ్ డైరెక్టర్ డా.ఎం.కిరణ్ కుమార్ అన్నారు. తయారీ ధరకే బంగారం, వజ్రాభరణాలను అందిస్తున్నామన్నారు. ప్రజలు పెద్దమొత్తంలో తమ కష్టార్జితాన్ని ఆదా చేయవచ్చన్నారు డా.కిరణ్ కుమార్. ప్రారంభోత్సవం సందర్భంగా మార్కట్లోని ఇతర షోరూంలలో లభించని సరికొత్త బంగారు నగల కొనుగోలు పథకంను ప్రారంభిస్తున్నామన్నారు.

ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో పలు ప్రాంతాల్లో విశేష ఆదరణ పొందింది లలితా జ్యూవెల్లరీ. ఇప్పుడు హైదరాబాద్ లోని చందానగర్ చుట్టపక్కల ప్రాంతాల వారికి మరింత చేరువయింది. తక్కువ తరుగు, తక్కువ ధరలో నగలు ఇవ్వాలనే ఉద్దేశంలో, వినియోగదారుల ఆశీస్సులతో ఈ షోరూంలను ఆరంభించామన్నారు. వైజాగ్, విజయవాడ, తిరుపతి, రాజమహేంద్రవరం, భీమవరం, కాకినాడ, గుంటూరు, శ్రీకాకుళం, గోపాలపట్నం, విజయనగరం, అనంతపురం, ఒంగోలు, నరసరావుపేట, నిజామాబాద్చ హైదరాబాద్ లోని కూకట్ పల్లి, సోమాజిగూడ, దిల్ షుఖ్ నగర్ షోరూంలకు ప్రజల నుంచి మంచి ఆదరణ లభించింది.

Read Also: British Queen Elizabeth 2 : ప్రపంచంపై ప్రత్యేక ముద్ర వేసిన బ్రిటన్ రాణి ఎలిజబెత్‌ 2

చందానగర్ మరియు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ఎక్కువ స్థాయిలో ప్రజలు మా ఇతర షోరూంలకు వచ్చి నగలు కొనడం గమనించాం. అందుకే ఇక్కడ కొత్త షోరూం ప్రారంభించామని డా.కిరణ్ కుమార్ తెలిపారు. చందానగర్ లోని నెం.2-132, ఇన్ఫినిటీ మాల్, చందానగర్, హైదరాబాద్ అనే చిరునామాలో కొత్త షోరూం ప్రారంభోత్సవం వైభవంగా జరిగిది. ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా చేవెళ్ల ఎంపీ, డా.జి.రంజిత్ రెడ్డి, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, హఫీజ్ పేట కార్పొరేటర్ వి.పూజిత గౌడ్, మాదాపూర్ కార్పొరేటర్ వి.జగదీశ్వర్ గౌడ్ పాల్గొన్నారు.

‘ఫ్లెక్సీ ఓ ఫ్లెక్సీ’ పేరుతో సరికొత్త నగదు కొనుగోలు పథకం అందుబాటులోకి తెచ్చింది లలితా జ్యూవెల్లరీ. ఇందులో విశేషం ఏంటంటే.. మీరు నెలనెలా కట్టే డబ్బు బంగారంగానూ ఆదా చేసుకోవచ్చు.. డబ్బుగానూ ఆదా చేసుకోవచ్చు. ఏ నగ అయినప్పటికీ 100 శాతం తరుగే లేదు. అలాగే ఒక నెల ఇన్ స్టాల్ మెంట్ లో 50 శాతం బోనస్ అందిస్తామన్నారు. కస్టమర్లు రూ.1000/, రూ.1500/, రూ.2500/, రూ.10000 వంటి వాయిదాలలో ఈ పథకంలో చేరి లబ్ధి పొందవచ్చు. చెయిన్, గాజులు, నెక్లెస్, చోకర్స్, హారం, వంకీ, ఒడ్డాణం, ఉంగరాలు, కమ్మలు, జుమ్కీలతో పాటు రకరకాల నగలు లక్షలాది సంఖ్యలో మా కొత్త షోరూంలలో వున్నాయని, దేశంలో అతితక్కువ ధరకు వజ్రాభరణాలు తమ దగ్గర లభ్యం అవుతాయన్నారు డా.కె.కిరణ్ కుమార్. మరిన్ని వివరాలకు లలిత జ్యూయెల్లరీ షోరూంని సంప్రదించాలని మేనేజింగ్ డైరెక్టర్ డా.కె.కిరణ్‌ కుమార్ తెలిపారు.

Read Also: Pilgrims Rush In Tirumala: ఆగస్టులో తిరుమలకు 22.22 లక్షలమంది భక్తులు

Exit mobile version