Site icon NTV Telugu

Mohanlal : లాలెట్టా.. ఆ జానర్ లో సినిమాలు వద్దు.. ఫ్యాన్స్ రిక్వెస్ట్

Mohan Lal

Mohan Lal

మాలీవుడ్ స్టార్ హీరో మోహన్ లాల్ జోష్ అండ్ జోరును యంగ్ హీరోలు బీట్ చేయలేరేమో. 65 ఇయర్స్‌లో కూడా రెస్ట్ అనే పదాన్ని మర్చిపోయి బ్యాక్ టు బ్యాక్ చిత్రాలు దించేస్తున్నారు. ఇప్పటికే ఈ ఏడాది L2 ఎంపురన్, తుడరుమ్, హృదయ పూర్వంతో హ్యాట్రిక్ హిట్ అందుకున్న లాలట్టన్. కన్నప్పలో క్యామియో రోల్‌తో మెప్పించారు. ఇప్పుడు ఫిప్త్ మూవీ వృషభను లోడ్ చేస్తున్నారు.అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కుతోంది వృషభ. మోహన్ లాల్ ఇందులో కింగ్‌గా కనిపించబోతున్నారు. దీపావళి రేసులో యంగ్ హీరోలతో పోటీ పడుతున్నాడు లాలట్టన్.

కన్నడ దర్శకుడు నంద కిషోర్ డీల్ చేస్తున్న ఈ సినిమాను కనెక్ట్ మీడియా, బాలాజీ టెలీ ఫిల్మ్స్, అభిషేక్ ఎస్ వ్యాస్ స్టూడియో సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. విజువల్ వండర్‌గా, పీరియాడిక్ ఫాంటసీ, యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోంది వృషభ. పునర్జన్మ బ్యాక్ డ్రాప్ స్టోరీగా రూపొందిస్తున్నట్లు సమాచారం. కానీ మోహన్ లాల్‌ను దృశ్యం, తుడరమ్ తరహాలో ఫ్యామిలీ ఆడియన్స్ రిసీవ్ చేసుకున్నట్లుగా పీరియాడిక్ అండ్ హిస్టారిక్ డ్రామాలను యాక్సెప్ట్ చేయలేపోతున్నారు. రూ. 100 కోట్లతో తెరకెక్కిన హిస్టారికల్ యాక్షన్ డ్రామా మరక్కార్‌ను మలయాళ ఆడియన్స్ తిప్పికొట్టారు. పీరియాడిక్ డ్రామా మలైకొట్టై వాలిబన్‌ది కూడా సేమ్ సిచ్యుయేషన్. ఇక లాస్ట్ ఇయర్ హండ్రెడ్ క్రోర్‌తో మెగాఫోన్ పట్టి తెచ్చిన బరోజ్ భారీ డిజాస్టర్. ఇప్పుడు పీరియాడిక్ డ్రామాగా వస్తున్న వృషభ పరిస్థితి ఏంటనేది హాట్ టాపిక్ గా మారింది. ఎంపురన్‌ను ఈ ఏడాది మాలీవుడ్‌లోనే హయ్యెస్ట్ గ్రాసర్ చిత్రంగా నిలిపిన లాలట్టన్ ఇప్పుడు రాబోతున్న వృషభతో ఆ వసూళ్లను బీట్ చేస్తారా. పీరియాడిక్ డ్రామాతో సక్సెస్ అందుకుని పాత లెక్కలు సరి చేస్తారా వెయిట్ అండ్ సీ.

Exit mobile version