NTV Telugu Site icon

Lakshya Sen: పతక పోరులో ఓడిన ‘లక్ష్యసేన్’.. పతకం లేకుండానే..

Lakshya Sen

Lakshya Sen

Lakshya Sen Paris Olympics 2024: 2024 పారిస్ ఒలింపిక్స్‌లో భారత షట్లర్ లక్ష్య సేన్ కాంస్య పతకాన్ని గెలిచే అవకాశాన్ని కోల్పోయాడు. 22 ఏళ్ల బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్ కాంస్య పతక పోరులో మలేషియా ఏడో సీడ్ లీ జి జియాతో 21-12, 16-21, 11-21 తేడాతో ఓడిపోయాడు. సైనా నెహ్వాల్, పివి సింధు బ్యాడ్మింటన్‌ లో భారతదేశం నుండి ఒలింపిక్ పతకాలు సాధించిన విజేతలుగా మిగిలిపోయారు. మ్యాచ్ మొదట్లో సేన్ కొన్ని అద్భుతమైన ర్యాలీలతో మొదటి గేమ్ ను సొంతం చేసుకున్నాడు.

Andhra Pradesh: వాలంటీర్ల కొనసాగింపుపై మంత్రి కీలక ప్రకటన

సెకండ్ హాఫ్‌లో భారత ఆటగాడు సేన్ ను జియా జియాను భీకర స్మాష్‌ లతో కలవరపరిచాడు. తర్వాత ప్రతీకారం తీర్చుకుని వరుసగా పాయింట్లు సాధించి గేమ్‌ను సాధించాడు. ఆపై సేన్ చారిత్రాత్మక పతకాన్ని సాధించడంలో విఫలమయ్యాడు. 2012 లండన్ గేమ్స్‌లో నెహ్వాల్ భారత్‌కు మొట్టమొదటి ఒలింపిక్ పతకాన్ని అందించింది. ఆమె కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది. సింధు ఒలింపిక్స్‌లో 2016 రియోలో రజతం, 2020 టోక్యోలో కాంస్యం సాధించింది.

Infinix Note 40x 5G: తక్కువ ధరలో ఐఫోన్ 15 లుక్‭తో వచ్చేస్తున్న ఇన్ఫినిక్స్ 5G మొబైల్..