Site icon NTV Telugu

Lakshmi Parvathi: ఉమామహేశ్వరి మృతిపై అనుమానాలు

Laxmi Parvathi

Laxmi Parvathi

ఎన్టీఆర్ కుటుంబంలో జరుగుతున్న సంఘటనలు చాలా బాధగా ఉన్నాయి. ఉమామహేశ్వరి మృతికి నా ప్రగాఢ సానుభూతి అన్నారు వైసీపీ నేత నందమూరి లక్ష్మీపార్వతి. ఏమీ జరిగిందనేది మిస్టరీగానే ఉంది. చంద్రబాబు నీచ రాజకీయాలు తెలిసిన వారు అనుమానించక తప్పదు.ఆ కుటుంబానికి చంద్రబాబు ఒక శనిలా పట్టుకున్నాడు. సింహగర్జనకు సిద్దమవుతున్న ఎన్టీఆర్ చంద్రబాబు చర్యల వల్ల గుండెతో మరణించారు.

ఆయన బ్యాంక్ అకౌంట్లు కూడా సీజ్ చేసి అధ్యక్ష పదవి కూడా లాక్కున్నారు. లక్ష్మీపార్వతి నీ బూచిగా చూపి కుటుంబాన్ని నమ్మించారు. హరికృష్ణకు మంత్రి పదవి ఇచి 6 నెలల్లోనే లాగేసుకున్నాడు. మానసికంగా హరికృష్ణ ఎన్నో ఇబ్బందులు పడ్డారు. అందుకే ఈ రోజుకీ కళ్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్ చంద్రబాబు మాట్లాడరు. ఈమె మరణం కూడా మిస్టరీ గా మారింది…సోషల్ మీడియాలో అనేక పోస్టులు వస్తున్నాయి

అందులో కొన్ని నమ్మేవి…నమ్మనివి ఉండొచ్చు. పోలీసులు ఒక లేఖ రాసి ఉండొచ్చు అన్నారు. చంద్రబాబు రంగప్రవేశం చేశాక ఆ లేఖ మాయం అయింది అంటున్నారు. కోడెల మరణంలో కూడా ఇదే జరిగింది…ఆయన ఫోన్ రికార్డులలో చంద్రబాబు గురించే ఉంది. అందుకే ఆయన ఫోన్ ఇప్పటికీ ఆచూకీ లేదు. మీ నాన్న పేరు చెప్పకుండా ఎన్టీఆర్ ని చంపి ఆయన పేరే చెప్పుకుంటున్నారు. అలాంటి ఆమె ఆత్మహత్య చేసుకోవడానికి కారణాలేమిటి? ఆస్తి వివాదాల్లో ఆమె ఆత్మహత్య చేసుకుందని నా అనుమానం అన్నారు లక్ష్మీపార్వతి.

నీ కొడుకును అందలం ఎక్కించడానికి నువ్వు ఏదైనా చేస్తావ్. ఒకవేళ నువ్వు కారణం కాకపోతే వారి సమస్య ఏమిటో పెద్దగా పరిష్కరించ లేవా? ఆమె సూసైడ్ నోట్ నువ్వు దొంగిలించావ్ అని ప్రచారం జరుగుతుంది. ఇప్పటికైనా పార్టీని బాలకృష్ణకు అప్పజెప్పి పక్కకు తప్పుకో. దీంట్లో ఏమీ లేదంటే నువ్వే వెంటనే సీబీఐ విచారణకు లేఖలు రాయాలి. నీకు రాయటం చేతకాకపోతే నేనే సీబీఐకి లేఖ రాస్తాను. సీబీఐ క్లీన్ చిట్ ఇస్తేనే తప్ప నిన్ను నమ్మలేము అన్నారు లక్ష్మీపార్వతి.

Anjan Kumar Yadav: బీజేపీ వాళ్లు బద్మాష్ కొడుకులు.. బట్టేబాజ్ మాటలు

Exit mobile version