Site icon NTV Telugu

Lakshmi Parvathi: బాధాకరం.. ఎన్టీఆర్ పేరుతో చెల్లని నాణెమా?

Lakshmi Parvathi

Lakshmi Parvathi

ఎన్టీఆర్‌కు భారతరత్న విషయం పక్కకు తప్పించారని ఏపీ తెలుగు అకాడమీ ఛైర్పర్సన్ లక్ష్మీపార్వతి ఆరోపించారు. చంద్రబాబు, పురందేశ్వరి కలిసి ఎన్టీఆర్‌కు మరోసారి వెన్నుపోటు పొడిచారని లక్ష్మీపార్వతి మండిపడ్డారు. ఎన్టీఆర్‌ పేరుతో చెల్లని నాణెం తీసుకురావడం బాధాకరమని లక్ష్మీపార్వతి అన్నారు. సోషల్ మీడియాలో చెల్లని నాణెం అని ఎగతాళి చేస్తుంటే.. కన్నీళ్లు వస్తున్నాయని లక్ష్మీపార్వతి ఆవేదన వ్యక్తం చేశారు. ఇదేనా ఎన్టీఆర్‌కు చేసే ఉపకారం? వ్యాపార కోణంలో ఎన్టీఆర్‌ను ఇలా వాడుకోవడం చాలా దారుణం అని ఆమె ధ్వజమెత్తారు.

Also Read : BRS Leaders: నేడు మార్కండేయ రథోత్సవం.. హరీష్‌ రావు నేతృత్వంలో షోలాపూర్‌ కు బీఆర్‌ఎస్‌

అంతేకాకుండా.. ‘నేను ఎన్టీఆర్కు అధికారికంగా భార్యను అవునా? కాదా? చెప్పాలి’ అని ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రం నుంచి పురందేశ్వరిని తరమికొట్టే వరకు వైసీపీ తరఫున పోరాటం చేస్తానన్నారు. లక్ష్మీపార్వతి. ఎన్టీఆర్ తనను అధికారికంగా వివాహం చేసుకున్నారని చెప్పుకొచ్చారు. తనను ఇల్లీగల్గా పెట్టుకోలేదని తీవ్రంగా మండిపడ్డారు. దీనిపై ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు స్పందించాలని డిమాండ్ చేశారు. ఎన్టీఆర్ ఫ్యామిలీలోని సొంత కార్యక్రమం అయి తనను ఆహ్వానించకపోయినా పట్టించుకునేదాన్ని కాదన్నారు లక్ష్మీపార్వతి. ఇది ప్రభుత్వ కార్యక్రమం అని అన్నారు. ప్రోటోకాల్ ప్రకారం తనను పిలవాలని అన్నారు. ఎన్టీఆర్ భార్యగా తనకు ఆహ్వాని అందాల్సిందన్నారు.ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచిన వాళ్ళు ఈ కార్యక్రమానికి హాజరయ్యారని ఆరోపించారు లక్ష్మీపార్వతి. దీనిపై ఆమె అభ్యతరం వ్యక్తం చేశారు.

Also Read : BRS Leaders: నేడు మార్కండేయ రథోత్సవం.. హరీష్‌ రావు నేతృత్వంలో షోలాపూర్‌ కు బీఆర్‌ఎస్‌

Exit mobile version