Site icon NTV Telugu

Lakshmi Menon: యువకుడి కిడ్నాప్ కేసు.. హీరోయిన్ లక్ష్మీ మీనన్‌కు హైకోర్టులో ఊరట!

Lakshmi Menon

Lakshmi Menon

నటి లక్ష్మీ మీనన్‌కు హైకోర్టులో ఊరట దక్కింది. సెప్టెంబర్ 17వరకు ఆమెకు ముందస్తు బెయిల్ మంజూర్ చేసింది కేరళ కోర్ట్. అప్పటి వరకు లక్ష్మీ మీనన్‌కు అరెస్ట్ చేయవద్దని పోలీసులకు తెలిపింది. ఓ ఐటీ ఉద్యోగినిని కిడ్నాప్ చేసి, అనంతరం దాడి చేసిన కేసులో ఆమెపై కేసు నమోదు చేసినట్లు కేరళ పోలీసులు తెలిపారు. నిందితుల్లో్ ముగ్గురిని అరెస్ట్ చేశామని, మరో నిందితురాలైన నటి లక్ష్మీ మీనన్ పరారీలో ఉన్నట్లు వెల్లడించారు. ఇక్కడ విశేషం ఏంటంటే.. ఎఫ్ఐఆర్‌లో లక్ష్మీ మీనన్‌ పేరు చేర్చలేదని తెలిసింది.

పూర్తి వివరాల్లోకి వెళితే.. ఆగస్ట్ 24న రాత్రి లక్ష్మీ మీనన్‌ తన స్నేహితులతో కలిసి ఓ రెస్టో బార్‌కు వెళ్లింది. అక్కడ కొందరు సాప్ట్ వేర్ ఉద్యో్గులతో వారికి గొడవ జరగింది. ఈ క్రమంలో తన స్నేహితులతో కలిసి ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగిని తమ కారులో ఎక్కించుకుని బెదిరిస్తూ.. బూతులు తిడుతూ హింసించారు. అంతేకాదు అతడిపై దాడి కూడా చేశారు. ఆ తర్వాత ఆ టెకీని మరోచోట విడిచిపెట్టి వెళ్లిపోయారు. దీంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించగా.. కేసు నమోదు చేసి ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. లక్ష్మీ మీనన్ పరారీలో ఉన్నట్లు సమాచారం.

Also Read: R Madhavan: వరదల్లో చిక్కుకున్న స్టార్ హీరో.. ఇది రెండోసారి!

కిడ్నాప్ కేసులో తన అరెస్ట్‌ను అడ్డుకోవాలని లక్ష్మీ మీనన్ కేరళ హైకోర్టును ఆశ్రయించగా.. ఆమెకు మద్దతుగా తీర్పునిచ్చింది. సెప్టెంబర్ 17వరకు ఆమెకు ముందస్తు బెయిల్ మంజూర్ చేసింది. ఎఫ్ఐఆర్‌లో లక్ష్మీ మీనన్‌ పేరు లేదన్న విషయం తెలుసుకున్న కొందరు ఆమెపై ఫైర్ అవుతున్నారు. ఎందుకు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని, నటీనటులకు ఏమైనా ప్రత్యేక చట్టాలు వర్తిస్తాయా అంటూ సోషల్ మీడియాలో మండిపడుతున్నారు.

Exit mobile version