NTV Telugu Site icon

Lakshitha Incident: మాకు అణా పైసా కూడా వద్దు.. టీటీడీపై లక్షిత తాత షాకింగ్‌ కామెంట్స్

Lakshitha

Lakshitha

Lakshitha Incident: తిరుమల నడక దారిలో చిరుత దాడిలో ప్రాణాలు విడిచిన చిన్నారి లక్షిత తాత శ్రీనివాసులు.. టీటీడీ, రాజకీయ నేతలపై ఓ రేంజ్‌లో విరుచుకుపడ్డారు.. తిరుమల నడక మార్గంలో మా బిడ్డ (మనవరాలు) చిరుత దాడిలో మరణిస్తే.. అటవీ శాఖ, టీటీడీ తప్పు లేదని టీటీడీ ఈవో ధర్మారెడ్డి చెబుతున్నారు.. అంతేగాక రూ.10 లక్షలు ఎక్స్ గ్రేషియా ఇచ్చినట్లు చెప్పారు.. మీరు ఎవరికి ఇచ్చారు.. ఎవరికి అందచేశారు. ఏ లబ్ది కోసం ఇలా చేస్తున్నారు.. ఎందుకు ఇలాంటి తప్పుడు మెసేజ్‌లు ఇస్తున్నారో అర్థం కావడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు.. మా పాప విలువను రూ.10 లక్షలుగా నిర్ణయించారు.. మా పాప ప్రాణాల విలువ రూ.10 లక్షలా? అంటూ కన్నీరు పెట్టుకున్నారు. కానీ, మాకు ప్రభుత్వం నుంచి గానీ, ప్రైవేట్‌ వ్యక్తుల నుంచి గానీ రూపాయి సాయం అవసరం లేదు.. చివరకు అణా పైసా సాయం కూడా తీసుకోవడానికి మేం సిద్ధంగా లేమంటూ మండిపడ్డారు.

Read Also: Samantha: చేస్తే అలా చెయ్… లేదంటే ఇంట్లోనే కూర్చో.. కౌంటర్ ఎవరికో

ఇక, జింకలకు ఇచ్చే రక్షణ మనుషులకు ఎందుకు ఇవ్వడం లేదు? అని టీటీడీని నిలదీశారు శ్రీనివాసులు.. జింకలను స్వేచ్ఛగా వదలాలి.. అప్పుడే మనుషుల కోసం చిరుతలు, పిలులు రావన్నారు.. అసలు జింకలను బంధించడానికి మీరు ఎవరు? అడవిలో వాటిని వదిలేయండి.. అప్పుడు మనుషుల కోసం జంతువులు రావు కదా? అని సూచించారు. పులి దాడులు జరుగుతున్నట్లు పత్రికల్లో వస్తున్నా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు అంటూ టీటీడీని ప్రశ్నించారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటన జరగకుండా చూడాలని హితవు పలికారు. కంచ వేసి ఉంటే నా బిడ్డకు ఏమీ అయ్యుండి కాదన్నారు.. ఎందుకు మీకు ఆలోచన రాలేదు అంటూ టీటీడీ, రాజకీయ నేతలపై విరుచుకుపడ్డారు శ్రీనివాసులు. మరోవైపు.. నాయకులు వస్తే.. వారికి భద్రత కలిపిస్తారు.. ఎందుకంటే మేం ఓట్లు వేయడం వల్ల వాళ్లు ప్రజాప్రతినిధులు అయ్యారు.. కానీ, మేం ఓటర్లం కాబట్టే.. మా లాంటి వాళ్ల ప్రాణాలకు రక్షణ ఉండదా? అంటూ ఆవేదన వ్యక్తం చేశారు లక్షిత తాత శ్రీనివాసులు.