Site icon NTV Telugu

Lady Thieves: సంక్రాంతి షాపింగ్‌లో కిలాడీ లేడీల చేతివాటం.. సమయస్ఫూర్తితో పట్టించిన డిప్యూటీ సీఎం కుమార్తె

Lady Thieves

Lady Thieves

Lady Thieves: సందట్లో సడేమియాలాగా సంక్రాంతి షాపింగ్‌లో కిలాడీ లేడీల చేతివాటం చూపించారు. ఖంగు తినిపించే వ్యూహంతో చీరల దొంగతనానికి పాల్పడ్డారు. ఇంతలోనే సీసీ కెమెరాల్లో చూసి నిర్వాహకులు అలెర్ట్ కాగా.. సమయ స్పూర్తితో కిలాడి లేడీలను పట్టించారు డిప్యూటీ సీఎం నారాయణ స్వామి కుమార్తె కృపాలక్ష్మి. విజయవాడ మాచవరం పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది.

Read Also: Seema Haider: రాముడిని దర్శించుకునేందుకు కాలినడక అయోధ్య వెళ్తానంటున్న పాక్ మహిళ..

విజయవాడ నగరంలోని ఒక ప్రముఖ వస్త్ర దుకాణంలో చీరలు దొంగిలించే ముఠా ఆటలు కట్టించారు ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి కుమార్తె కృపాలక్ష్మి. మాచవరం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విజయవాడ బందర్ రోడ్‌లోని పీవీపీ మాల్ సమీపంలో గోలి హ్యాండ్లూమ్స్‌లో ఈరోజు అనగా శనివారం నాడు షాపింగ్ కొరకు వెళ్లారు డిప్యూటీ సీఎం నారాయణస్వామి కుమార్తె కృపా లక్ష్మి. ఈ సందర్భంగా తను షాపింగ్ చేస్తున్నప్పుడు పక్కనే ఉన్న ఐదుగురు మహిళలు ఖరీదైన చీరలు చూపించాలి అంటూ హడావుడి చేయటం గమనించారు. షాపులో సిబ్బంది ఖరీదైన చీరలు చూపిస్తుండగా.. ఒక ఐదు చీరలను దొంగిలించారు కిలాడీలు. ఈ విషయం షాపులో ఉన్న వారు ఎవరు గమనించ లేదు. కానీ షాపు యజమాని ఇంటి వద్ద ఉన్న సీసీ కెమెరాలు చూస్తూ ఉండగా మహిళా దొంగలు చీరలు కాజేస్తున్నట్లుగా గమనించారు. ఈ విషయమై ఫోన్ ద్వారా సిబ్బందికి సమాచారం ఇచ్చే లోపల నలుగురు మహిళలు అక్కడి నుంచి పరారయ్యారు.

Read Also: Viral News : ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్‌ చేసిన కస్టమర్‌.. అందులో వచ్చింది చూసి షాక్..

ఈ విషయం గమనించిన డిప్యూటీ సీఎం నారాయణ స్వామి కుమార్తె కృపా లక్ష్మి సమయస్ఫూర్తితో మహిళా దొంగను చాకచక్యంగా పట్టుకున్నారు. వెంటనే పోలీసులకు సమాచారాన్ని అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మహిళా దొంగను అదుపులో తీసుకున్నారు. షాపు సిబ్బంది, షాపు నిర్వాహకులు కృపా లక్ష్మి చూపిన ధైర్యానికి, తెగువకు అభినందించారు

Exit mobile version