కాంగ్రెస్ మేనిఫెస్టోలో ప్రకటించిన ఐదు హామీలలో మొదటి హామీ శక్తి హామీ పథకాన్ని ఈరోజు మధ్యాహ్నం 1 తరవాత గంటకు ప్రారంభించనున్నారు. కర్ణాటక రాష్ట్రంకు చెందిన మహిళలందరికీ ఆర్టీసీ, బీఎంటీసీ బస్సులో ఉచితంగా ప్రయాణించేందుకు ఈ పథకం వర్తిస్తుంది. మహిళా లబ్ధిదారులకు సీఎం సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం డీకే. శివకుమార్ శక్తి స్మార్ట్‌కార్డులు పంపిణీ చేస్తారు. కండక్టర్లు మాత్రం లబ్ధిదారులకు జీరో ఫేర్ టిక్కెట్లు ఇస్తారు. కర్ణాటక వ్యాప్తంగా మధ్యాహ్నం 1 గంటకు ఈ పథకాన్ని అమలు చేస్తారు. ఈ పథకం కర్ణాటక మహిళలకు మాత్రమే వర్తిస్తుంది. లబ్ధిదారులు ఫోటోలు, అడ్రెస్ ప్రూఫ్ లు చూపించవలసి ఉంటుంది. సేవాసింధు పోర్టల్‌లో శక్తి స్మార్ట్ కార్డ్ నమోదు ప్రక్రియను ప్రభుత్వం ఆదివారం మధ్యాహ్నం 2 గంటల తరువాత ప్రారంభించనుంది. ఉచిత ప్రయాణానికి తప్పనిసరిగా స్మార్ట్ కార్డులు పొందేందుకు ప్రభుత్వం మూడు నెలల గడువు ఇచ్చింది.
Also Read : Purandeswari: జనసేన, బీజేపీ కలిసే ఉన్నాయి.. వారి భేటీకి రాజకీయ ప్రాధాన్యత లేదు..
బీపీఎల్ కుటుంబాలకు 10 కిలోల ఉచిత బియ్యం పంపిణీ చేసేందుకు మైసూర్‌లో జూలై 1న పథకాన్ని ప్రారంభించనున్నట్లు కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది. ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చు. కన్నడ రాష్ట్ర విద్యార్థినులకు కూడా ఈ సౌకర్యం వర్తిస్తుంది. రాజహంస, వజ్ర, వాయు వజ్ర, ఐరావత, ఐరావత క్లబ్ క్లాస్, ఐరావత గోల్డ్ క్లాస్, అంబారీ, అంబారీ డ్రమ్ క్లాస్, అంబారీ ఉత్సవ్, ఎఫ్‌టి బస్, ఈవీ పవర్ ప్లస్ బస్సుల్లో ఉచిత ప్రయాణం వర్తించదు. మహిళలకు ఉచిత ప్రయాణానికి అనుమతి ఇచ్చిన బస్సుల్లో కొన్ని సీట్లను పురుషుల కోసం రిజర్వ్ చేశారు. పథకాన్ని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆదివారం లాంఛనంగా ప్రారంభించనున్నారు. కండక్టర్ అవతారం ఎత్తనున్నారు. దీనికోసం బెంగళూరులోని మెజస్టిక్ కెంపెగౌడ బస్‌స్టేషన్ నుంచి విధాన సౌధ వరకు రూట్ నంబర్ 43 సిటీ బస్‌లో ప్రయాణించనున్నారు. స్వయంగా ప్రయాణికులకు టికెట్లను జారీ చేయనున్నారు. పురుష ప్రయాణికులకు బస్ టికెట్లను జారీ చేస్తారు.
