Gen-z Viral Video: భద్రతా సిబ్బందితో ఒక మహిళా వాగ్వాదం చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రయాణ ఆంక్షల కారణంగా గంటల తరబడి వేచి ఉండాల్సి రావడంతో ఆమె అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. వీడియోలో తాను ‘‘జెన్-జీ’’కి చెందిన దానినని చెబుతూ హంగామా సృష్టించింది. ఈ వీడియో ముందుగా కాశ్మీర్‌కు చెందినదిగా ప్రచారం జరిగింది. అయితే, ఇది లడఖ్‌లోని మినిమార్గ్ చెక్ పోస్టు వద్ద జూలైలో చోటుచేసుకున్నట్లు వెల్లడైంది.
నివేదికల ప్రకారం.. ద్రాస్ సమీపంలోని మిని మార్గ్ చెక్‌పోస్ట్ వద్ద భద్రతా సిబ్బంది వాతావరణ పరిస్థితులు, ఆపరేషనల్ కారణాల వల్ల పర్యాటకుల రాకపోకల్ని కొంతసేపు నిలిపేశారు. దీంతో అక్కడ పలువురు పర్యాటకులు గంటల తరబడి వేచి ఉండాల్సి వచ్చింది. సుమారు ఐదు గంటల నిరీక్షణ తర్వాత మహిళ ఆగ్రహం వ్యక్తం చేస్తూ హంగామా చేసింది. వైరల్ అవుతున్న వీడియోలో తాము ‘జెన్-జీ’ తరానికి చెందినవారమని, ఈ పరిస్థితిని సహించబోమని చెప్పడం కనిపించింది. ఇతర పర్యాటకులు కూడా తనకు మద్దతు ఇవ్వాలని ఆమె కోరింది.
ఈ వీడియోపై జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా స్పందించారు. “మేము జెన్-జెడ్” అనేది “మా నాన్న ఎవరో తెలుసా?” అనే పాత తరహా బెదిరింపులకు కొత్త రూపంగా మారుతోంది అంటూ ఆయన వ్యాఖ్యానించారు. చిన్నచిన్న విషయాల్లోనూ ‘జెన్-జీ’ గుర్తింపును ఒత్తిడి సాధనంగా ఉపయోగించడం ఆ తరంపై ప్రజల్లో ఉన్న సానుభూతిని దెబ్బతీస్తుందని పేర్కొన్నారు. ఈ వైరల్ వీడియోపై భారత సైన్యం స్పందించింది. వీడియోలో కనిపిస్తున్న చెక్ పాయింట్ వద్ద సైన్యం కాకుండా పోలీసులు ఉన్నారని తెలిపింది. ఈ ఘటనకు భారత సైన్యానికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది.
We are Gen-Z and we won't tolerate this nonsense. Kashmiriyo ke sath toh karte hi the ab tourist ke sath bhi karne lagye. pic.twitter.com/7aluOiFUjJ
— DesiEsco🇮🇳 (@DesiEsco7) August 19, 2026

