NTV Telugu Site icon

Andhra Pradesh: ఏజెన్సీలో తీరని కష్టాలు.. డోలీలో ఆస్పత్రికి గర్భిణీ..

Doli

Doli

Andhra Pradesh: ప్రభుత్వాలు మారుతున్న గిరిజనుల తలరాతలు మాత్రం మారడం లేదు. నిత్యం ఏదో ఒక గ్రామంలో గిరిజనులకు డోలిమోత కష్టాలు తప్పడం లేదు. అరకులోయ మండల బస్కి పంచాయతీ కొంత్రాయిగుడకి చెందిన సమర్ది డాలిమ్మ అనే గర్భిణీకి శుక్రవారం పురిటి నొప్పులు వచ్చాయి. దీంతో కుటుంబీకులు అంబులెన్సు ఫోన్ చేసినప్పటికీ రోడ్డు సౌకర్యం లేకపోవడంతో చేసేది ఏమీ లేక కుటుంబీకులు డోలి కట్టుకుని మూసుకుని ఆసుపత్రికి తరలించారు.

Read Also: Afghanistan: సూపర్-8 చేరి జోష్‌లో ఉన్న అఫ్గనిస్తాన్‌కు భారీ షాక్‌!

అల్లూరి జిల్లా అరకులోయ మండలం బస్కి పంచాయితీ కొంత్రాయిగుడ గ్రామానికి చెందిన సమర్థి దాలిమ్మ అనే గర్భిణీని డోలీలో మోసుకుంటూ మాడగడ ఆసుపత్రికి తరలించారు స్థానికులు.. శుక్రవారం ఉదయాన్నే పురిటి నొప్పులు రావడంతో అంబులెన్స్ సకాలంలో రాని కారణంగా కిలోమీటర్ దూరం మీద కుర్చీకి కట్టుకొని డోలిమోత ద్వారా మోసుకొచ్చారు. ఇక, మార్గ మధ్యలో అంబులెన్స్ రావడంతో గర్భిణిని మాడగడ ఆసుపత్రికి తీసుకువెళ్లి ప్రసవం చేయించారు. సకాలంలో ఆసుపత్రికి చేర్చడంతో గర్భిణి మగ బిడ్డకు జన్మనిచ్చిందని కుటుంబ సభ్యులు తెలిపారు. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత అయినా మా గ్రామానికి సరైన రహదారి సౌకర్యం కల్పించాలని గ్రామ ప్రజలు గిరిజన సంఘం నాయకులు కోరుతున్నారు.. కాగా, ఏళ్లు గడుస్తున్నా.. ఏజెన్సీలో గిరిజనులకు తిప్పలు తప్పడం లేదు.. ఎంతో మంది ఇలా డోలీలలో ఆస్పత్రులకు వెళ్తూ.. ప్రాణాలు విడిచిన ఘటనలో ఎన్నో ఉన్నాయి.