Site icon NTV Telugu

Munugode By Poll : నేడు నామినేషన్‌ వేయనున్న కూసుకుంట్ల.. మునుగోడుకు మంత్రి కేటీఆర్‌

Koosukuntlaprabhakarreddy

Koosukuntlaprabhakarreddy

kusukuntla prabhakar reddy nomination today

ప్రస్తుతం తెలంగాణలో మునుగోడు మేనియా నడుస్తోంది. తెలంగాణ ప్రజలతో పాటు పాటు దేశవ్యాప్తంగా మునుగోడు ఉప ఎన్నికపై ఎంతో ఆసక్తి నెలకొంది. మునుగోడు ఉప ఎన్నికలో మరోసారి గెలిచేందుకు ఈ సారి బీజేపీ నుంచి బరిలోకి దిగుతున్నారు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి. అయితే.. మునుగోడు కాంగ్రెస్‌ కోట అంటూ.. కాంగ్రెస్‌ అభ్యర్థినే గెలపించాలని విస్తృత ప్రచారం చేస్తున్నారు కాంగ్రెస్‌ శ్రేణులు. ఇదిలా ఉంటే.. జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెడుతున్న నేపథ్యంలో ఈ ఉప ఎన్నిక టీఆర్‌ఎస్‌కు ప్రత్యేకమైంది. దీంతో అధికార టీఆర్‌ఎస్‌ సైతం ఈ మునుగోడు ఉప ఎన్నికలో గులాబీ జెండా ఎగురవేసేందుకు వ్యూహాలు రచిస్తోంది.

 

అయితే.. ఇప్పటికే మునుగోడు బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి, కాంగ్రెస్‌ అభ్యర్థి పాల్వాయి స్రవంతి లు నామినేషన్లు దాఖలు చేశారు.. ఈ క్రమంలో నేడు టీఆర్‌ఎస్‌ తరుఫున బరిలోకి దిగనున్న కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి నామినేషన్‌ను దాఖలు చేయనున్నారు. అయితే.. ఈ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్‌ పాల్గొననున్నారు. అయితే.. రేపటితో నామినేషన్‌ ప్రక్రియకు తెరపడనుంది. అయితే.. 17న నామినేషన్‌ విత్‌డ్రా ఉండనుంది. వచ్చేనెల 3న పోలింగ్‌, 6న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు అధికారులు.

Exit mobile version