Site icon NTV Telugu

Kushi Twitter Review : ఖుషి హిట్టా.. ఫట్టా ట్విటర్ ఏం చెబుతుందంటే?

Kushi

Kushi

Kushi Twitter Review : విజయ్ దేవరకొండ, సమంత మొదటి సారి కలిసి నటించిన సినిమా ఖుషి. పాన్ ఇండియా లెవల్లో నేడు గ్రాండ్ గా రిలీజ్ అయింది. తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. తెలుగు రాష్ట్రాల కంటే ముందు అమెరికాలో ప్రీమియర్ షోలు మొదలయ్యాయి. సినిమా ఎలా ఉందో అక్కడ చూసిన ప్రేక్షకుల స్పందనను పలువురు ట్విటర్లో పంచుకున్నారు.

తొలుత విజయ్ దేవరకొండ, సమంతల మధ్య కెమిస్ట్రీకి ప్రేక్షకుల మంచి మార్కులు వేశారు. తమ తమ పాత్రల్లో విజయ్ – సమంత జీవించారని అభిమానులు చెబుతున్నారు. ఆ తర్వాత కామెడీ గురించి చాలామంది బావుందని చెప్పుకొస్తున్నారు. ఇక పాటల విషయానికి వస్తే కొన్ని పాటలు ట్రెండ్ సెట్టర్స్ గా నిలిచాయి. స్క్రీన్ మీద కూడా పాటల పిక్చరైజేషన్ బావుందని ప్రేక్షకులు చెబుతున్నారు.

Read Also:ISRO Chairman: ఇండిగో విమానం ఎక్కిన ఇస్రో చైర్మన్.. అక్కడి సిబ్బంది ఏం చేసిందంటే?

మొత్తంగా అమెరికా ప్రీమియర్ షోస్ నుంచి ఖుషి సినిమాకు పాజిటివ్ టాక్ వస్తోంది. దాంతో రౌడీ బాయ్ ఫ్యాన్స్ ఆనందానికి అవధుల్లేవు. చాలా మంది ‘హిట్ కొట్టేశాం రా అబ్బాయిలూ’ అంటూ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ‘జెర్సీ’ సినిమాలో నాని రైల్వే స్టేషన్ దగ్గరకు వెళ్లి అరిచిన సీన్ పోస్ట్ చేసి షేర్ చేస్తున్నారు. ‘నిన్ను కోరి’, ‘మజిలీ’ వంటి మంచి చిత్రాలు అందించిన శివ నిర్వాణ, ఈ ‘ఖుషి’ చిత్రానికి దర్శకత్వం వహించారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మించారు. మలయాళ హిట్ ‘హృదయం’ ఫేమ్ హిషామ్ అబ్దుల్ వాహెబ్ ఈ సినిమాకు సంగీతం అందించారు. ‘ఖుషి’లో స్టోరీ సింపుల్ అని, కథ నుంచి పెద్దగా ఏమీ ఆశించవద్దని కొందరు సూటిగానే చెప్పేశారు.

Exit mobile version