Kushi Movie : ‘ఖుషి’ నుంచి ఎమోషనల్ లవ్ సాంగ్ ‘ఓసి పెళ్లామా..’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలివుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటిస్తున్న చిత్రం ‘ఖుషి’. శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రానికి అదిరిపోయే బజ్ ఉంది. లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా దర్శకుడు శివ నిర్వాణ రూపొందించారు నవీన్ యెర్నేని, వై రవిశంకర్‌లు నిర్మించిన ఈ చిత్రం సెప్టెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు రానుంది… ఈ క్రమంలో గత కొన్ని రోజులుగా హీరో హీరోయిన్లు చిత్ర ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు..
ఈ సినిమాపై హీరో విజయ్ దేవరకొండ ఆశలు పెట్టుకున్నారు.. గత కొన్నేళ్లుగా సరైన హిట్ సినిమా విజయ్ ఖాతాలో పడలేదు.. ఈ సినిమా నుంచి ప్రతి అప్డేట్ జనాలను తెగ ఆకట్టుకున్నాయి.. హోల్ సమ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ‘ఖుషి’కి మ్యూజిక్ ఎంత ప్లస్ అయ్యిందో మనం చూస్తూనే ఉన్నాం.. అందుకే ఈ సినిమాకు స్పెషల్ గా మ్యూజిక్ కన్సర్ట్ నిర్వహించారు. ఈ మ్యూజిక్ కన్సర్ట్ కు ఆడియెన్స్ నుంచి హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటిదాకా ఈ సినిమా నుంచి విడుదలైన నాలుగు లిరికల్ సాంగ్స్ మ్యూజిక్ లవర్స్ ను ఆకట్టుకున్నాయి.. ఆ పాటలన్నీ ఇప్పటికి యూట్యూబ్ లో ట్రెండ్ అవుతున్నాయి..
Also Read
- BRICS Summit: అణిచివేతకు తలొగ్గం.. ఢిల్లీ వేదికగా అమెరికా, ఇజ్రాయెల్‌కు ఇరాన్ అధ్యక్షుడి మాస్ వార్నింగ్..!
- iPhone 18 వచ్చేసింది.. కానీ iPhone 17కే డిమాండ్.. కారణం తెలిస్తే షాక్ అవుతారు!
- BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!
- Kiren Rijiju: "ఆ విషయంలో తగ్గేదేలే".. చైనాకు కిరణ్ రిజిజు స్ట్రాంగ్ వార్నింగ్!
సినిమా విడుదలకు కేవలం కొద్ది రోజులుగా ఉండగా రొమాంటిక్ లవర్స్ కోసం సినిమాలోని ఐదో పాట ‘ఓసి పెళ్లామా..’ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఆగస్టు 26న ఈ పాటను విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ‘ఓసి పెళ్లామా..’ పాట అనౌన్స్ మెంట్ సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్ లో షాంపేన్ తో విప్లవ్ తన ఫ్రెండ్స్ ను ఉత్సాహపరుస్తున్న మూమెంట్ ఇంప్రెస్ చేస్తోంది. సెన్సార్ నుంచి యూ/ఏ సర్టిఫికెట్ పొందిన ‘ఖుషి’ ఇంకో 8 రోజుల్లో పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. విప్లవ్, ఆరాధ్య ప్రేమకథను అందంగా తెరపై చూపించబోతోందీ సినిమా.. ఇకపోతే ఈ సినిమా అందరి అంచనాలకు తగిన విధంగా చిత్రం బ్లాక్‌బస్టర్ హిట్ అవుతుందనే నమ్మకం వుంది. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో కూడా విడుదల కానుంది..
తాజావార్తలు
-
Indian Air Force: భారత్-యూకే రక్షణ సహకారంలో కొత్త అధ్యాయం.. బ్రిటిష్ పైలట్లకు ఇక భారత IAF శిక్షణ
-
DC Success Gift : అందరికి ఇచ్చి ‘వామికాగబ్బీ’కి కారు గిఫ్ట్ ఎందుకు ఇవ్వలేదు.?
-
BRICS Summit: అణిచివేతకు తలొగ్గం.. ఢిల్లీ వేదికగా అమెరికా, ఇజ్రాయెల్‌కు ఇరాన్ అధ్యక్షుడి మాస్ వార్నింగ్..!
-
iPhone 18 వచ్చేసింది.. కానీ iPhone 17కే డిమాండ్.. కారణం తెలిస్తే షాక్ అవుతారు!
-
Chandan Anand: ‘హనుమాన్ అంశ్’ తర్వాత మారిన చందన్ ఆనంద్ అదృష్టం.. సల్మాన్, షారుఖ్ సినిమాల్లో ఛాన్స్
ట్రెండింగ్
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?