NTV Telugu Site icon

Unbelievable Catch: ఇలా కూడా పడతారా.. క్రికెట్ చరిత్రలోనే కనీవినీ ఎరుగని క్యాచ్!

Unbelievable Catch

Unbelievable Catch

Stunning Catch Viral Video: క్రికెట్ చరిత్రలోనే కనీవినీ ఎరుగని క్యాచ్ ఒకటి సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ క్యాచ్‌ను చూసిన ప్రతీ ఒక్కరూ వామ్మో అంటూ నోరెళ్ల బెడుతున్నారు. ‘క్రికెట్ చరిత్రలోనే ఆల్‌టైమ్ బెస్ట్ క్యాచ్‌’, ‘కనీవినీ ఎరుగని క్యాచ్’, ‘బాబోయ్ ఇలా కూడా క్యాచ్ పెట్టొచ్చా’, ‘క్యాచ్ ఆఫ్ ద ఇయర్‌’ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. సోషల్ మీడియాను అంతగా షేక్ చేస్తున్న ఈ క్యాచ్.. ఈసీఎస్ బల్గేరియా టీ20 టోర్నీలో చోటు చేసుకుంది.

టోర్నీలో భాగంగా శనివారం (ఆగష్టు 3)న వీటీయూ-ఎంయూ ప్లెవెన్‌, అఫ్యోంకరహిసర్ ఎస్‌హెచ్‌ఎస్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ప్లెవెన్ ఇన్నింగ్స్ నాలుగో ఓవర్‌లో అఫ్యోంకరహిసర్ ఫీల్డర్ కుర్సాద్ దల్యాన్ అసాధారణమైన క్యాచ్‌ను అందుకున్నాడు. అఫ్యోంకరహిసర్ బౌలర్ షకీల్ ఫరూకి వేసిన బంతిని ప్లెవెన్‌ బ్యాటర్ ఆనందు కృష్ణ.. ఆన్-సైడ్ వైపు భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు. అయితే టైమింగ్ మిస్ అవ్వడంతో మిడ్ ఆన్‌లో బంతి గాల్లో లేచింది. అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న దల్యాన్ క్యాచ్ పట్టేందుకు పరుగెత్తుకొచ్చాడు. అయితే బంతి దూరంగా పడే అవకాశం ఉండడంతో కాలు ముందుకు పెట్టాడు.

Also Read: Graham Thorpe Dead: ఇంగ్లండ్‌ లెజెండరీ క్రికెటర్‌ కన్నుమూత!

సరిగ్గా బంతి కుర్సాద్ దల్యాన్ పాదం మీద పడి గాల్లోకి లేచింది. దల్యాన్ సునాయాసంగా క్యాచ్ అందుకున్నాడు. దాంతో బ్యాటర్ ఆనందు కృష్ణ సహా ఫీల్డర్లు అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. దాంతో ప్లెవెన్‌ను 3.3 ఓవర్లలో 14 పరుగులకే నాలుగు వికెట్స్ కోల్పోయింది. దల్యాన్ క్యాచ్‌కు సంబందించిన వీడియో నెట్టింట వైరల్ అయింది. ఈ మ్యాచులో ముందుగా బ్యాటింగ్ చేసిన అఫ్యోంకరహిసర్ నిర్ణీత 10 ఓవర్లలో 104/5 స్కోర్ చేసింది. ఛేదనలో ప్లెవెన్‌ 40/8కి పరిమితమైంది.